Crime News: న‌వ వ‌దువు హ‌త్య కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు..!

ప్రేమగా చూసుకోవాల్సిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం పెనుభూతంగా మారిపోయింది. ఈ క్రమంలో మనిషి అనే విషయాన్ని మర్చిపోయి మృగంలా ప్రవర్తించాడు.

Crime News: న‌వ వ‌దువు హ‌త్య కేసులో మరో ట్విస్ట్..  పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు..!
Twist In Newly Married Bride Murder Case
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 28, 2021 | 8:54 PM

Hyderabad Bride Murder Case: న‌వ వ‌దువు హ‌త్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సుధారాణి ని వెంట‌పడి ప్రేమించిన కిర‌ణ్.. కాళ్ల పారాణి ఆరక ముందే దారుణ హత్య ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. ఎంగేజ్‌మెంట్‌కు ముందే సుధారాణి హ‌త్యకు స్కెచ్ వేసి ఫెయిల్ అయిన కిర‌ణ్.. వివాహమైన నెల‌లోనే హ‌తమార్చి క‌క్ష తీర్చుకున్నాడు.

ప్రేమగా చూసుకోవాల్సిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం పెనుభూతంగా మారిపోయింది. ఈ క్రమంలో మనిషి అనే విషయాన్ని మర్చిపోయి మృగంలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యపై కిరాతకానికి పాల్పడ్డాడు. స‌ర్జిక‌ల్ బ్లేడ్‌తో భార్యను దారుణంగా హ‌త్య చేసి క‌సి తీర్చుకున్నాడు. కామారెడ్డి జిల్లా దేవుని పల్లి గ్రామానికి చెందిన గంగారామ్‌ కూతురు సుధారాణితో గత నెల 27 వ తేదీన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిరణ్‌కుమార్‌తో ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి తంతు ముగిశాక, కొత్త కాపురం పెట్టడానికి హైదరాబాద్‌కు వచ్చారు. బాచుపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లోని శ్రీసాయి ద్వారకా అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. వారం రోజుల క్రితం అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లోకి అద్దెకు దిగారు..

కోటీ ఆశలతో కొత్త కాపురంలో తన భర్తతో అడుగుపెట్టింది నవ వధువు సుధారాణి. తన కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలని కోరుకుంది. కానీ, ఆ పచ్చని కాపురంలో అనుమానం చిచ్చు రేపి హ‌త్యకు దారి తీసింది. హైద‌రాబాద్ వ‌చ్చి కాపురం పెట్టి వారం రోజులు దాటకముందే భర్త అనుమానం మొద‌లైంది. త‌న తండ్రి.. తోటి ఎంప్లాయిస్‌తో అమె చ‌నువుగా ఉండ‌టాన్ని చూసి జీర్ణించుకోలేక‌పోయాడు. ఇదే విష‌యంపై గ‌త వారం రోజులుగా భార్యతో గోడ‌వకు దిగుతున్నాడు కిర‌ణ్. దీంతో తీవ్ర వేద‌న‌కు గురైన‌ సుధారాణికి పేరెంట్స్‌ ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నామని చెప్పారు. తన తల్లిదండ్రులు వస్తున్నారన్న విషయాన్ని భర్తకు చెప్పింది. కూతురు కాపురాన్ని చూడటానికి ఎన్నో ఆశలతో అక్కడికి వచ్చిన సుధారాణి తల్లిదండ్రులకు రక్తపు మడుగులో కనిపించింది నవ వధువు.

బెడ్‌ మీద రక్తపు మడుగులో సుధారాణి విగతజీవిగా చూసి త‌ల్లితండ్రులు షాక్ అయ్యారు. బాత్‌రూమ్‌లో ఆమె భర్త కిరణ్‌ రక్తపు మడుగులో ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. తన సోదరి ఒంటినిండా గాయాలున్నాయని, గొంతు పైన కత్తితో కట్‌ చేయడంతో చేతులు, కాళ్లపైన కూడ గాయపర్చారని సుధారాణి కుటుంబ స‌భ్యులు అంటున్నారు. పెళ్లికి ముందు కిరణ్‌ అనుమానిస్తున్నట్లు తెలియడంతో అతని తల్లిదండ్రుల సమక్షంలోనే అతనికి కౌన్సిలింగ్‌ ఇచ్చారని, ఆ తరువాతే పెళ్లి చేశారని సుధారాణి సోదరుడు పోలీసుల‌కు తెలిపాడు.

ఎంగేజ్‌మెంట్ జరిగినా కొన్నాళ్లకే సుధారాణి చంపేందుకు ప్రయత్నం చేశాడు కిరణ్. పెళ్లి అయిన 28 రోజులకు సుధారాణి హత్య చేసి సైకో కిరణ్ క‌సి తీర్చుకున్నాడు. ప‌క్క స్కెచ్ లో భాగంగానే కామారెడ్డిలో ఉన్న సుధారాణిని.. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు తీసుకువచ్చి హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు తేల్చారు. సుధారాణిని చంపేందుకు ఆన్‌లైన్‌లో కత్తిని ఆర్డర్ చేసి తెప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అదే కత్తితో సుధారాణి గొంతు, కాళ్లు, కడుపు దగ్గర కోసి.. తర్వాత తానూ ఆత్మహత్యయత్నం చేశాడు కిర‌ణ్.

కాగా, ప్రస్తుతం కిరణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుధారాణి డెడ్‌బాడీకి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యలకు అప్పగించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  Posani Krishna Murali: పోసాని పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్.. పోలీస్టేషన్‌లో ఫిర్యాదు..