బ్లేడ్‌తో భార్య గొంతుకోసిన భర్త..! నిందితుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు.. కారణాలు ఇలా ఉన్నాయి..?
Husband Strangled Wife : ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎంతమంది నేరగాళ్లను శిక్షించినా
Husband Strangled Wife : ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎంతమంది నేరగాళ్లను శిక్షించినా మార్పు రావడం లేదు. నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అబలలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్, చిలకలూరిపేట సమీపంలోని బోయపాలెం గ్రామంలో కట్టుకున్న భర్తే సొంత భార్యను చంపాలని ప్రయత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫోపుల్ గనున్, రీటా దంపతులు కొద్దికాలం కిందట మండలానికి వలస వచ్చారు. బోయ పాలెం గ్రామంలోని ఓ నూలుమిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్న వాళ్ల సంసారంలో ఇటీవల కలహాలు మొదలయ్యాయి. తనను లెక్కచేయడం లేదన్న అక్కసుతో గనున్.. భార్య రీటాపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. స్థానికులు గమనించి అతన్ని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన యడ్లపాడు ఎస్‌ఐ పైడి రాంబాబు సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి బాధితురాలు రీటాను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రీటా ఆస్పత్రిలో మాట్లాడుతూ.. తన భర్త ఆవేశంతో తొందరపడి అలా చేశాడని అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లొద్దని వేడుకుంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని స్టేషన్‌కి తరలించారు.