AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. అర్థరాత్రి దగ్గరుండి చికిత్స చేయించిన ఎమ్మెల్యే..

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి సాధారణ వ్యక్తిలా వచ్చిన ఆయన.. అక్కడే ఉన్న ఒక బెంచిపై కూర్చొని బాలుడికి అందుతున్న వైద్యంపై వాకబు చేశారు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే.. ఆయన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అని తెలిసింది.

Andhra: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. అర్థరాత్రి దగ్గరుండి చికిత్స చేయించిన ఎమ్మెల్యే..
Guntur Mla
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 22, 2026 | 2:13 PM

Share

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి సాధారణ వ్యక్తిలా వచ్చిన ఆయన.. అక్కడే ఉన్న ఒక బెంచిపై కూర్చొని బాలుడికి అందుతున్న వైద్యంపై వాకబు చేశారు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే.. ఆయన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అని తెలిసింది. అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి ఎందుకొచ్చారు. ఆ బాలుడికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం అని అక్కడున్న రోగులు ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

నగరంలోని నల్లచెరువు ప్రాంతంలో రాత్రి సమయంలో ఇంటి వద్దే ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు ఫణీంద్ర రెడ్డిపై కుక్కల గుంపు దాడి చేసింది. పది వరకూ కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అలెర్ట్ అయి కుక్కల గుంపును తరిమి బాలుడిని రక్షించారు. అయితే అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కి తెలిసింది. సాధారణంగా అయితే సూపరింటెండెంట్ కి ఫోన్ చేసి బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. ఎమ్మెల్యే నసీర్ మాత్రం రాత్రి ఒంటి గంట సమయంలో ఆసుపత్రికి వచ్చారు. బాలుడికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఫణీంద్ర రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించి ఘటన జరిగిన తీరు గురించి వాకబు చేశారు. ఏదో వచ్చాం వెళ్లాం అంటూ కాకుండా బాలుడి పరిస్థితి కుదుట పడేంత వరకూ అక్కడే ఉన్నారు. ఒక బెంచిపై సాధారణ రోగి బంధువులా కూర్చోని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.

వీడియో చూడండి..

వైద్యులు, వైద్యసిబ్బంది వెంటనే మెరుగైన చికిత్స అందించడంతో బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. ఆ తర్వాత మరోసారి వైద్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలుడిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులకు సూచించి అక్కడ నుండి వెళ్లిపోయారు. ప్రభుత్వం నుండి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే దగ్గరు నుండి మెరుగైన వైద్యం చేయించడం, తమ కొడుకు కోలుకుంటుండంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నసీర్ ఆ తర్వాత గుంటూరు కార్పోరేషన్ అధికారులతో మాట్లాడి కుక్కల బెడద తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్పోరేషన్ కమీషనర్ మయూర్ ఆశోక్ కూడా తగు చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us