Shikhar Dhawan: 40 ప్లస్‌లో గబ్బర్ రెండో వివాహం.. శిఖర్ ధావన్ కంటే సోఫీ ఎన్నేళ్లు చిన్నదో తెలుసా?
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో సారి పెళ్లిపీటలెక్కాడు. శనివారం (ఫిబ్రవరి21) తన ప్రియురాలు సోఫీ షైన్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తో పాటు పలువురు ప్రముఖులు గబ్బర్ పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు.

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ 40 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నాడు. తన ప్రియురాలు సోఫీ షైన్‌తో కలిసి శనివారం (ఫిబ్రవరి 21) తో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తో పాటు ఇతర క్రికెటర్లు శిఖర్-సోఫీల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రస్తుతం శిఖర్ ధావన్- సోఫీ షైన్ ల పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో శిఖర్ భార్య సోఫీ గురించి నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అలాగే వీరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ పై కూడా నెటిజన్లు భిన్న రకాలుగా చర్చించుకుంటున్నారు. శిఖర్ ధావన్ 1985 డిసెంబర్ 5న జన్మించాడు. గత డిసెంబర్‌లో తన 40వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. మరోవైపు, cricketledger.com ప్రకారం, సోఫీ షైన్ వయస్సు ప్రస్తుతం 35 సంవత్సరాలు. అంటే శిఖర్ కంటే సోఫీ 5 సంవత్సరాలు చిన్నది అన్నమాట.
ఇక సోఫీ షైన్ విషయానికి వస్తే.. ఆమె ఐర్లాండ్ కు చెందినది. ఐర్లాండ్ లో పుట్టి అక్కడే చదువుకుంది. పాఠశాల తర్వాత, ఆమె లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాజిల్ రాయ్ కాలేజీలో చదువుకుంది. సోఫీ తన కెరీర్‌ను ఐరిష్ ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా ప్రారంభించింది. తరువాత ఆమె అబుదాబిలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసింది. ఆమె ఇప్పుడు డా వన్ స్పోర్ట్ COOగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
శిఖర్ ధావన్ పెళ్లిలో సినిమా సెలబ్రిటీలు..
Karishma Kotak, Namrata Sharma and Shefali Bagga in the marriage celebration of Shikhar Dhawan and Sophie Shine. 😊😊#shikhardhawan #sophieshine #karishmakotak #namratasharma #shefalibagga pic.twitter.com/g3Bkfjcoib
— Cric4Cric (@Cric4_cric) February 22, 2026
శిఖర్ ధావన్, సోఫీ షైన్ 2023 లో మొదటిసారిగా కలుసుకున్నారు. ఇద్దరి మనసులు, అభిరుచులు కలవడంతో కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
శిఖర్ ధావన్- సోఫీల పెళ్లి ఫొటోస్..
Heartiest congratulations to our Gabbar, Shikhar Dhawan for Second marriage, and Mrs. Dhawan on their wedding💍❤️ #ShikharDhawan pic.twitter.com/028SVKoKfO
— The Muslim (@TheIndMuslim) February 22, 2026
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




