AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే యువకుడు.. విశాఖ భీమిలిలో సూసైడ్ చేసుకున్నాడు. ప్రేయసి ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకే తను ఉరివేసుకుని చనిపోవడం కలకలం రేపింది.. ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీయడంతో.. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి..

Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Feb 22, 2026 | 8:46 AM

Share

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే యువకుడు.. విశాఖ భీమిలిలో సూసైడ్ చేసుకున్నాడు. ప్రేయసి ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకే తను ఉరివేసుకుని చనిపోవడం కలకలం రేపింది.. ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీయడంతో.. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ కుమార్, పావని ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. పావని ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్యామ్ కుమార్ భయపడిపోయాడు. పావని సూసైడ్‌నోట్ ఆధారంగా హైదరాబాద్‌ జీడిమెట్ల పీఎస్‌లో శ్యామ్‌పై కేసు నమోదయింది. దీంతో శ్యామ్.. విశాఖపట్నం పారిపోయి వచ్చాడు. భీమిలిలోని ఓ లాడ్జిలో రూము తీసుకుని.. అక్కడే ఉన్నాడు. అయితే.. పావని మృతి చెందిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్న శ్యామ్ కుమార్.. శుక్రవారం మద్యంలో విషం కలుపుకుని తాగి.. ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్యామ్ రూము తలుపులు తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం స్పేర్ కీతో తలుపులు తీసి చూశారు. అప్పటికే.. శ్యామ్ కుమార్ విగతజీవిగా కనిపించాడు. హైదరాబాద్‌లో ప్రేయసి పావని కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.. అంతలోనే శ్యామ్ కుమార్‌ సూసైడ్ చేసుకోవడం విషాదం నింపింది.. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

పావని సూసైడ్‌ నోట్ ఆధారంగా కేసు..

పావని సూసైడ్‌ నోట్ ఆధారంగా హైదరాబాద్‌ జీడిమెట్ల పీఎస్‌లో శ్యామ్‌పై కేసు నమోదయింది. కేసు నమోదుతో మనస్తాపానికి గురై.. విశాఖకు పారిపోయి లాడ్జీలో శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అనకాపల్లి, ఆనందపురంలో శ్యామ్‌పై కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు.. శ్యామ్‌ ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూమ్ లో ఎలుకల మందు, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. సారీ అమ్మ అంటూ.. శ్యామ్ దానిలో రాశాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
సరైన సమయంలో తిరిగి దాడి చేస్తాం.. తాలిబన్ల హెచ్చరిక!
సరైన సమయంలో తిరిగి దాడి చేస్తాం.. తాలిబన్ల హెచ్చరిక!
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్