AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Fraud: మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా?.. ఇప్పుడే చెక్ చేసుకోండి, లేకుంటే మొదటికే మోసం!

డిజిటల్ యుగంలో సౌకర్యాలతో పాటు సైబర్ ముప్పులు కూడా పెరిగిపోతున్నాయి. మన వ్యక్తిగత పత్రాలైన ఆధార్, పాన్ కార్డు వివరాలు ఆన్‌లైన్‌లో సులభంగా దొరుకుతుండటంతో, సైబర్ నేరగాళ్లు వాటిని అడ్డం పెట్టుకుని మనకు తెలియకుండానే రుణాలు పొందుతున్నారు. ఆ డబ్బు దొంగల ఖాతాలోకి వెళ్లినా, ఆ అప్పు తీర్చాల్సిన భారం, పెరిగే వడ్డీ మాత్రం మన తలపై పడుతున్నాయి. భవిష్యత్తులో మీకు అత్యవసరంగా రుణం కావాల్సి వచ్చినప్పుడు ఈ 'బినామీ లోన్లు' మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీసి, బ్యాంకులు లోన్ ఇవ్వకుండా అడ్డుపడతాయి.

Financial Fraud: మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా?.. ఇప్పుడే చెక్ చేసుకోండి, లేకుంటే మొదటికే మోసం!
Is Someone Else Taking Loans In Your Name Check
Bhavani
|

Updated on: Feb 22, 2026 | 8:44 AM

Share

మీరు ఏ రోజూ బ్యాంకులో అప్పు తీసుకోకపోయినా, మీ క్రెడిట్ హిస్టరీలో లోన్లు కనిపిస్తున్నాయంటే మీరు మోసానికి గురైనట్లే. ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి క్రమం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పేరు మీద ఉన్న రుణాలను ఎలా తనిఖీ చేయాలి, మోసపోయినట్లు తెలిస్తే ఎలా స్పందించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేయండి

మీ పేరు మీద ఎన్ని లోన్లు ఉన్నాయి, క్రెడిట్ కార్డుల వినియోగం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రతి మూడు నెలలకోసారి మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేయడం ఉత్తమం. CIBIL, Experian, Equifax లేదా CRIF High Mark వంటి అధికారిక వెబ్‌సైట్లలో మీ పాన్ కార్డ్ వివరాలు ఇచ్చి ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్‌ను చూసుకోవచ్చు. ఇందులో మీకు సంబంధం లేని ‘ఓపెన్’ లోన్లు ఏవైనా ఉంటే వెంటనే గుర్తించవచ్చు.

బ్యాంక్ అలర్ట్‌ల పట్ల అప్రమత్తత

చాలామంది బ్యాంకు నుంచి వచ్చే SMSలను ప్రకటనలు అనుకుని వెంటనే డిలీట్ చేస్తారు. కానీ, మీ ఖాతా నుంచి EMI కట్ అయినట్లు లేదా కొత్త లోన్ మంజూరైనట్లు మెసేజ్ వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీకు సంబంధం లేని లావాదేవీల గురించి మెసేజ్ రాగానే వెంటనే మీ నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి లోన్ స్టేటస్‌ను క్రాస్-చెక్ చేసుకోవాలి.

మోసపోయినట్లు గుర్తిస్తే ఏం చేయాలి?

ఒకవేళ మీ ఐడి ప్రూఫ్‌తో ఎవరైనా రుణం తీసుకున్నారని నిర్ధారించుకుంటే భయపడాల్సిన పనిలేదు. వెంటనే మీ ఆధార్, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్లను తీసుకుని సదరు బ్యాంకు శాఖను సందర్శించి అధికారులకు ఫిర్యాదు చేయండి. ఇది ‘ఐడెంటిటీ థెఫ్ట్’ (గుర్తింపు దొంగతనం) అని లిఖితపూర్వకంగా తెలియజేయండి. దీనితో పాటు సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల భవిష్యత్తులో మీకు చట్టపరమైన ఇబ్బందులు కలగవు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆర్థిక లావాదేవీల విషయంలో వ్యక్తిగత పత్రాల షేరింగ్‌లో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.

Follow Us
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
మురికి పట్టిన షూస్‌ను కొత్తవాటిలా మెరిపించే మ్యాజిక్ చిట్కాలు!
మురికి పట్టిన షూస్‌ను కొత్తవాటిలా మెరిపించే మ్యాజిక్ చిట్కాలు!
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు!
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు!
అత్యాచారం చేసి దాడి చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
అత్యాచారం చేసి దాడి చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
ఫ్లోరల్ నెయిల్ ఆర్ట్ తో సరికొత్త ఫ్యాషన్ విప్లవం!
ఫ్లోరల్ నెయిల్ ఆర్ట్ తో సరికొత్త ఫ్యాషన్ విప్లవం!