AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్వంటీ20 వరల్డ్ కప్: భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? అహ్మదాబాద్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

టీ20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 22) టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం చాలా కీలకం. కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశముంది.

ట్వంటీ20 వరల్డ్ కప్: భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? అహ్మదాబాద్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
India vs SA T20 World Cup Super 8
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 9:26 AM

Share

T20 ప్రపంచ కప్‌లో సూపర్ 8 రౌండ్ నిరాశజనకంగా ప్రారంభమైంది. శనివారం (ఫిబ్రవరి 21) పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ పడిన తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీనితో తదుపరి మ్యాచ్‌లకు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందని క్రికెట్ అభిమానులు చెందుతున్నారు. ఇక ఆదివారం రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడుతుండగా, ఫ్లడ్ లైట్ల వెలుతురులో భారతదేశం, దక్షిణాఫ్రికా జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. సెమీ-ఫైనల్ రేస్ లో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకుచాలా ముఖ్యమైనది. ఓడిన జట్టుకు నాకౌట్ రేసు అవకాశాలు సంక్లిష్టమవుతాయి. కాబట్టి విజయం కోసం రెండు జట్లు హోరా హోరీగా తలపడే అవకాశముంది. మరి ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్‌కు ముందు మోడీ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది? ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందా? తదితర విషయాలు తెలుసుకుందాం రండి.

అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం దాదాపు లేదని నిర్వాహకులు చెబుతున్నారు. టాస్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు, మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మైదానం పరిసరాల ఉష్ణోగ్రత 24 నుండి 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ 40 శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తంమీద, ఆటకు ఇది మంచి వాతావరణమేని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పిచ్ రిపోర్టు ఏంటంటే?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే మైదానం పెద్దగా ఉండటం వల్ల బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లు కొట్టాలంటే కాస్త శ్రమించాల్సిందే. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశముంది. మొదటి బ్యాటింగ్ చేసే జట్టును తక్కువ పరుగులకు నిలువరించి, రెండవ ఇన్నింగ్స్‌లో పరుగులను ఛేదించడం సులభం అవుతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. మంచు ప్రభావం ఉండడంతో రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుందని తెలుస్తోంది.

ఈరోజు డబుల్ ధమాకా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భార్యను తీవ్రంగా కొట్టి.. చనిపోయిందని వదిలి వెళ్లిన భర్త.. చివరకు
భార్యను తీవ్రంగా కొట్టి.. చనిపోయిందని వదిలి వెళ్లిన భర్త.. చివరకు
ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..!
ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..!
ధన లాభం, కొత్త ఉద్యోగం.. పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులదే అదృష్టం
ధన లాభం, కొత్త ఉద్యోగం.. పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులదే అదృష్టం
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్