AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఫిట్‌నెస్ విషయంలో తగ్గేదేలే.. తలకిందులుగా వేలాడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు పట్టారా?

దక్షిణాదిలో భారీ యాక్షన్ సినిమాలకు ఈ హీరోనే కేరాఫ్ అడ్రస్. అయితే గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డాడీ ట్యాలెంటెడ్ హీరో. దీంతో ఫిట్ నెట్ పై పూర్తిగా దృష్టి సారించాడు. కఠినమైన వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తూ ఆ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు.

Tollywood: ఫిట్‌నెస్ విషయంలో తగ్గేదేలే.. తలకిందులుగా వేలాడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Actor Vishal
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 1:14 PM

Share

పైన ఫోటోలో తలక్రిందుగా వేలాడుతూ కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరో. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. మాస్ హీరోగా అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పేరుకు తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులోనూ ఈ స్టార్ హీరోకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది లాగే ఇతను కూడా ఛైల్డ్ ఆర్టిస్టు గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ మధ్యన కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడ్డాడీ ట్యాలెంటెడ్ హీరో. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే కొన్ని రోజుల్లోనే మళ్లీ తేరుకోవడంతో ఫ్యాన్స్ చాలా హ్యపీగా ఫీలయ్యారు. ఇక గత కొన్ని రోజులుగా ఫిట్ నెట్ పై బాగా దృష్టి సారించాడీ హీరో. క్రమం తప్పకుండా జిమ్ కు వెళుతున్నాడు. కఠినమైన వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తున్నాడు. అంతేకాదు ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అలా తాజాగా జిమ్ లో తలకిందులుగా వేలాడుతూ కనిపించాడీ హీరో. మరి అతనెవరో గుర్తు పట్టారా?

కోలీవుడ్ మాస్ హీరో విశాల్ ఆ మధ్యన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.,డెంగ్యూ బారిన పడడంతో బాగా బక్కచిక్కిపోయి కనిపించాడు. ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే కోలుకోవడంతో ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఈక్రమంలో ఫిట్ నెస్ పై మరింత దృష్టి పెట్టాు విశాల్. ట్రైనర్, కాబోయే భార్య సాయి ధన్సిక సహకారంతో జిమ్ లో గంటల తరబడి గడుపుతున్నాడు. ఈ క్రమంలో విశాల్తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన జిమ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ట్రైనర్, సాయి ధన్సికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడీ హీరో.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశాల్ తన 36వ చిత్రంలో బిజీగా ఉన్నారు. సుందర్ సి దర్శకత్వంలో ‘మొగుడు’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు విశాల్.ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో విశాల్- సుందర్ సి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్, మగ మహారాజు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాల తరహాలోనే ‘మొగుడు’ మూవీ కూడా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

జిమ్ లో విశాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us