AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వానలే వానలు.. ఏయే జిల్లాల్లో అంటే..?

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం, ణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తాజా హెచ్చరిక జారీ చేసింది. ఏయే జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది? అనేది తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వానలే వానలు.. ఏయే జిల్లాల్లో అంటే..?
Ap Weather Updates
Krishna S
|

Updated on: Feb 22, 2026 | 1:40 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఇది రాబోయే 48 గంటల్లో తన దిశను మార్చుకుని ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీనికి తోడు తమిళనాడు నుంచి మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావం కూడా ఏపీపై బలంగా ఉంది.

వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా..

ఉత్తర కోస్తా ఆంధ్ర – యానాంలో ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది. సోమవారం వాతావరణంలో మార్పులు వచ్చి, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం కూడా ఉండవచ్చు. రాయలసీమ జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

ఉష్ణోగ్రతల నమోదు

రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో ప్రస్తుతానికి పెద్దగా మార్పులు ఏవీ ఉండబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే గాలుల దిశ మార్పు వల్ల రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో చలి ప్రభావం కంటే పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్ష సూచన నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని, వాహనదారులు పొగమంచు సమయంలో ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని సూచించడమైనది.

Follow Us
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వానలే వానలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వానలే వానలు..
రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తే ఎంత వస్తుంది?బెస్ట్‌ ఆప్షన్‌ కావచ్చు
రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తే ఎంత వస్తుంది?బెస్ట్‌ ఆప్షన్‌ కావచ్చు
కేంద్ర దృష్టి యోగంతో ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్..!
కేంద్ర దృష్టి యోగంతో ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్..!
పైసా రిస్క్ లేదు.. ప్రాఫిట్ మాత్రమే.. నెలకు రూ.17 వేల ఆదాయం..
పైసా రిస్క్ లేదు.. ప్రాఫిట్ మాత్రమే.. నెలకు రూ.17 వేల ఆదాయం..
తలకిందులుగా వేలాడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తలకిందులుగా వేలాడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
గురు బలం.. జూన్‌ నుంచి ఆ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!
గురు బలం.. జూన్‌ నుంచి ఆ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!
పాములను చంపితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష..! నమ్మరు కానీ.. ఇదే నిజం..
పాములను చంపితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష..! నమ్మరు కానీ.. ఇదే నిజం..
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడంలేదా? ఐతే మీఆహారంలో వీటిని చేర్చండి
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడంలేదా? ఐతే మీఆహారంలో వీటిని చేర్చండి
ఖాతాలో నామినీ లేకపోతే పిల్లలు డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
ఖాతాలో నామినీ లేకపోతే పిల్లలు డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
చిన్న వయసులోనే పెళ్లి.. ఏడాదికే తల్లయ్యింది..!
చిన్న వయసులోనే పెళ్లి.. ఏడాదికే తల్లయ్యింది..!