Hyderabad: రెచ్చిపోతున్న లోన్ యాప్స్ ముఠా.. రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలోకి డబ్బులు.. చివరకు
Loan Apps: డబ్బులు చెల్లించకపోతే ఫొటో మార్ఫింగ్‌ల పేరుతో వేధిస్తున్నారు. దీంతో నెత్తీనోరూ బాదుకుంటున్నారు బాధితులు. ఇలా చేస్తున్న ముఠా చైనాకు చెందినదిగా గుర్తించారు పోలీసులు.
Loan Apps Harassment: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ లోన్ యాప్స్ ముఠా మళ్లీ రెచ్చిపోతోంది. లోన్ రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ చేసి, వేధింపులకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. నేరుగా యాప్ డౌన్‌లోడ్ లింక్స్ పంపుతున్న ముఠా, నగదు జమ అయ్యేలా చేస్తున్నారు. ఆ తర్వాత వారం రోజుల్లో డబ్బులు చెల్లించాలంటూ వేధింపులు స్టార్ట్ చేస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే ఫొటో మార్ఫింగ్‌ల పేరుతో వేధిస్తున్నారు. దీంతో నెత్తీనోరూ బాదుకుంటున్నారు బాధితులు. ఇలా చేస్తున్న ముఠా చైనాకు చెందినదిగా గుర్తించారు పోలీసులు. ఈ యాప్స్‌ను చైనా నుంచి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కాల్ సెంటర్లు లేకుండా వర్క్ ఫ్రమ్‌హోం ద్వారా ఈ లోన్ యాప్‌ను నిర్వహిస్తున్నారు. గూగుల్ ట్రాన్స్‌లేషన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. అయితే, అనుమతి లేకుండా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారంటూ వాపోతున్నారు బాధితులు. ఇప్పటికే జంటనగరాల్లో వందల లోన్ యాప్‌లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
లోన్ యాప్స్ వేధింపుల కారణంగా మానసిక క్షోభకు గురైనవారు, పరువు పోయిందని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఇటీవల సంచలనంగా మారాయి. ఇటీవల కొందరు లోన్ తీసుకోని చెల్లించని వారికి.. న్యూడ్ ఫొటోలను కూడా సెండ్ చేసి ఆన్లైన్ లోన్ యాప్‌ల నిర్వహాకులు వేధింపులకు గురిచేసిన ఘటనలు వెలుగులోకి సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. పోలీసులు యాక్షన్ తీసుకున్న కొంత కాలం సైలెంట్‌గా ఉండి, కొత్త తరహాలో లోన్ ఇవ్వడం, వేధింపులకు గురిచేయడం కామన్‌గా మారింది. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..