అమానుష ఘటన.. దెయ్యం పట్టిందని కన్నకొడుకును చిత్రహింసలు పెట్టి.. కొట్టి చంపిన తల్లి.!
భూత వైద్యం పేరుతో ఏడేళ్ల బాలుడ్ని చిత్రహింసలు పెట్టి నిలువునా ప్రాణాలు తీసేసిన మూఢత్వం తమిళనాడులో చోటు చేసుకుంది. అనారోగ్యంతో...
భూత వైద్యం పేరుతో ఏడేళ్ల బాలుడ్ని చిత్రహింసలు పెట్టి నిలువునా ప్రాణాలు తీసేసిన మూఢత్వం తమిళనాడులో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి చిత్రహింసలు పెట్టి చంపింది. ఈ ఘటనలో తల్లి సహా మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా అరణిలో ముగ్గురు మహిళలు కలిసి ఏడేళ్ల పసివాడిని చిత్రహింసలు పెట్టారు. అది గమనించిన స్థానికులు కన్నమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, పాపం..అప్పటికే బాలుడు మృతిచెందాడు. దీంతో తల్లితో సహా ముగ్గురు మహిళలు పోలీసులు అరెస్ట్ చేశారు.
కొడుకుకి దెయ్యం పట్టిందని, అందుకే పూజలు చేశామని, ఈ క్రమంలో బాలుడు చనిపోయాడని వారు పోలీసులకు తెలిపారు. కన్నతల్లి సబరియమ్మ మానసిక స్థితి సరిగ్గా లేదని, డబ్బుల కోసమే ఇదంతా జరిగి ఉంటుందని బంధువులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read:
వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..
ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!
నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!