AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Man Suicide: ఒంటిపై కిలోన్నర బంగారంతో ఆకర్షించిన కేపీ పటేల్.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న గోల్డ్ మ్యాన్..!

ఒంటినిండా బంగారంతో ఆందరి దృష్టిని ఆకర్షించిన గోల్డ్ మ్యాన్‌ కుంజల్ పటేల్ అలియాస్ కేపీ పటేల్ బలవన్మరణానికి పాల్పడ్డారు.

Gold Man Suicide: ఒంటిపై కిలోన్నర బంగారంతో ఆకర్షించిన కేపీ పటేల్.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న గోల్డ్ మ్యాన్..!
Ahmedabad Gold Man Suicide
Balaraju Goud
|

Updated on: Jun 21, 2021 | 1:50 PM

Share

Ahmedabad Gold Man Suicide: ఒంటినిండా బంగారంతో ఆందరి దృష్టిని ఆకర్షించిన గోల్డ్ మ్యాన్‌ కుంజల్ పటేల్ అలియాస్ కేపీ పటేల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన ఇంట్లోనే గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని మధుపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాలు.. కుంజల్ పటేల్ మధుపురలోని యోగేష్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. మధుపురలోనే వాహనాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుంజల్ పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ధరియపూర్ నియోజకవర్గం నుంచి శివసేన ఆభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. కేపీ పటేల్ గత శనివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పదునైన కత్తితో గొంతు కోసుకుని విగతజీవిగా పడి ఉన్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మధుపుర పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా, కుంజల్ తన మెడలో ఒకటిన్నర కిలోగ్రాముల కంటే ఎక్కువ బంగారు ఆభరణాలను ధరించి తిరుగుతూ ఉండేవాడు. అతనిని అందరూ గోల్డ్‌మెన్ పేరుతో పిలవడం ప్రారంభించారు.

Read Also….  CM KCR: వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికాసేపట్లో అత్యాధునిక వైద్య సేవల కేంద్రానికి భూమిపూజ