Blasting Material: హోలీ వేళ కార్టన్ బాక్సుల కలకలం.. పార్శిల్స్ తెరిచిన పోలీసులు షాక్!
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం(Vanasthalipuram) నవతా ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో పేలుడు పదార్థాల కలకలం రేపింది.
Hyderabad Blasting materials: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం(Vanasthalipuram) నవతా ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో పేలుడు పదార్థాల కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట (Chilakalooripeta) నుంచి పుణెకు పార్సిల్ చేసిన 8 కార్టన్ డబ్బాలలో పేలుడు పదార్థాలు ఉన్నట్టు ట్రాన్స్‌పోర్టు సిబ్బంది గుర్తించారు. ఈ నెల 15న ఈ పార్శిల్ వనస్థలిపురంలోని కార్యాలయానికి చేరుకోగా, సాధారణ తనిఖీల్లో భాగంగా ఇవాళ వాటిని పరిశీలించారు. ఈ మేరకు అందులో పేలుడు పదార్థాలు(Blasting Material) ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారమిచ్చారు. వారి సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడు పదార్థాలను పరిశీలించారు. కార్టన్లలో ఉన్నది సినిమా చిత్రీకరణలో వాడే బాంబులుగా గుర్తించారు. 8 కార్టన్లలో సుమారు 100 బాంబులు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గతంలో జరిగిన ఘటనలో.. నగరంలోని రాజేంద్ర నగర్ లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పోలీసులు కనుగొన్న పేలుడు పదార్థాలలో భారీ స్థాయిలో అమ్మోనియం డిటోనేటర్లు, నైట్రో గ్లిజరిన్ ఉన్నాయి. పేలుడు పదార్థాల నివకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఉగ్రవాద సమస్యతో సతమత మవుతున్న నగరం ఈ భారి పేలుడు పదార్థాల నిలవ తో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యింది. మళ్ళీ నగరంలో ఏదైనా విపత్కర ఘటన జరగనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also…. Puzzle Picture: ఈ ఫోటోలో ఒక వీరుడు దాగున్నాడు.. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టగలరా?