Telangana: అంతా బావే చెశాడు.. మ్యాటర్ తెలిసిన తరువాత ఆ యువతి ఏం చేసిందంటే..
Telangana: సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని మహిళను బ్లాక్ మెయిల్ చేస్తున్న భూపాలపల్లి జిల్లా కటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ అనే యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని మహిళను బ్లాక్ మెయిల్ చేస్తున్న భూపాలపల్లి జిల్లా కటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ అనే యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసకు బావ అయ్యే వ్యక్తి తనను మోసం చేశాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత యువతి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. యువకుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళిత.. కాటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ.. బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ వరుసకు మరదలు అయ్యే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంగా యువతిపై మోజు పెంచుకున్నాడు సాయి కృష్ణ.
ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్లా్న్ వేశాడు. ఈ క్రమంలోనే ఓ రోజు బాధిత యువతి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. దీన్ని అడ్డుగా పెట్టుకుని యువతిని లొంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు. తానెవరో తెలియకుండా ఉండేందుకు వేరే వ్యక్తుల పేరిట నకిలీ సిమ్ కార్డ్ కొనుగోలు చేశాడు. దానితో వాట్సా్ప్ క్రియేట్ చేసి.. యువతి వాట్సాప్‌కు స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియోను పంపించాడు. యువతిని న్యూడ్ కాల్ చేయాలంటూ బ్లాక్ మెయిన్ చేశాడు. అలా యువతిని మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో యువతి.. తనను వేధిస్తోంది ఎవరా అని ఆరాతీయగా షాకింగ్ నిజం తెలిసిందే. తనను వేధిస్తోంది.. వరుసకు బావ అయ్యే సాయి కృష్ణ అని తెలుసుకుంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిపై 354 D IT act 67-A కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read:
Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!
Spinal Cord Surgery: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. బాలుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్స్..!
Summer Health Tips: వేపవి కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణుల సూచనలు మీకోసం..