Spinal Cord Surgery: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. బాలుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్స్..!

Indian Spinal Injuries Centre: వెన్నుపాము సమస్యతో బాధపడుతున్న 16 ఏళ్ల బాలుడికి ఇండియన్ సెంటర్ ఫర్ స్పైనల్ ఇంజూరీస్(Indian Spinal Injuries Centre) వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు.

Spinal Cord Surgery: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. బాలుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్స్..!
Spinal Cord
Follow us

|

Updated on: Mar 17, 2022 | 7:12 PM

Indian Spinal Injuries Centre: వెన్నుపాము సమస్యతో బాధపడుతున్న 16 ఏళ్ల బాలుడికి ఇండియన్ సెంటర్ ఫర్ స్పైనల్ ఇంజూరీస్(Indian Spinal Injuries Centre) వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. అసలు నడవలేకపోవడమే కాదు.. కనీసం ఆక్సీజన్ కూడా తీసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న బాలుడికి.. శస్త్ర చికిత్స చేసి మామూలు వ్యక్తిగా తీర్చి దిద్దారు. రెండు సార్లు శస్త్ర చికిత్స చేసి.. బాలుడు స్వయంగా గాలి పీల్చుకోవడంతో పాటు.. తనంతట తాను నడిచేలా చేశారు.

వివరాల్లోకెళితే.. పంజాబ్‌కు చెందిన హిమ్మేశ్వర్ పుట్టినప్పటి నుంచి కైఫోస్కోలియోసిస్‌తో బాధపడుతున్నాడు. ఆ సమస్య కారణంగా అతను ఎక్కడికీ నడిచి వెళ్లలేడు. కనీసం లేవలేడు కూడా. అయితే, గత మూడేళ్లలో ఈ సమస్య మరింత ముదరడంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్ కావడంతో పాటు.. ఊపిరితిత్తులు కూడా దెబ్బతినడంతో ఎక్కడికెళ్లినా ఆక్సిజన్ సిలిండర్ వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కైఫోస్కోలియోసిస్‌ సమస్య మరింత తీవ్రమై.. పరిస్థితి విషమించింది. దాంతో హిమ్మేశ్వర్‌ను Indian Spinal Injuries Centreలో చేర్పించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు.. పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రహించారు. చాలా కష్టపడి హిమ్మేశ్వర్‌కు రెండు శస్త్ర చికిత్సలు చేశారు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో పాటు.. బాలుడి ఆరోగ్యం సాధారణ స్థితికి రావడం సంచలనం సృష్టించింది. ‘‘ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స. వెన్నెముకకు ఆపరేషన్ చేసేటప్పుడు నరాలు దెబ్బతిన్నట్లయితే కాళ్లకు పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ సర్జరీని ఛాలెంజ్‌గా స్వీకరించి. బాలుడి ఎముకలు, తుంటికి మెటల్ బ్యాగ్స్, రింగులను అమర్చి వెన్నెముకకు ఆపరేషన్ చేసి నిటారుగాచేశారు. 2 నెలల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాం. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ శ్వాస సంబంధిత సమస్య నుంచి కూడా కోలుకున్నాడు. ఇప్పుడు తనంతట తాను నగవగలుగుతున్నాడు. ఈ సర్జరీ తరువాత బాలుడికి కొత్త జీవితం ప్రారంభమైంది. ప్రస్తుతం అతను ఆక్సీజన్ సహాయం లేకుండా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాడు.’’ అని ఇండియన్ సెంటర్ ఫర్ స్పైనల్ ఇంజురీ డాక్టర్ నంద తెలిపారు.

Also read:

TS SSC Exams: తెలంగాణాలో పరీక్షల తేదీలపై అభ్యంతరాలు.. టెన్త్ ఎగ్జామ్ డేట్స్ మార్చాలని టీపీఏ డిమాండ్

Meghalaya High Court: అలా చేయడం కూడా అత్యాచారమే అవుతుంది.. మేఘాలయ హైకోర్టు సంచలన తీర్పు

Redmi 10: రూ. 10 వేలకే 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. రెడ్‌మీ 10 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ