Redmi 10: రూ. 10 వేలకే 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. రెడ్‌మీ 10 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Redmi 10: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రెడ్‌మీ 10 పేరుతో ఓ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లోనే అదిరిపోయే ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Mar 17, 2022 | 6:47 PM

 ఇటీవల వరుసగా కొత్త ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రెడ్‌ 10 మోడల్‌ను లాంచ్‌ చేసింది. మార్చి 24 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, ఎమ్‌ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది.

1 / 5
ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ రూ. 9,999, 6 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ రూ. 11,999కి అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

2 / 5
ఈ ఫోన్‌లో 6.71 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు కార్నింగ్‌ గొరిల్లా గ్రాస్‌ 3 ప్రొటెక్షన్‌ను అందించారు. స్నాప్‌ డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో రామ్‌ బూస్టర్‌ను సైతం అందించారు. దీంతో 2జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.

3 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన రెడ్‌మీ 10 స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీలో భాగంగా 4జీ ఎల్‌టీఈ, వైఫై, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

5 / 5
Follow us