AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harbhajan Singh: రాజ్యసభకు క్రికెటర్ హర్భజన్ సింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ

Harbhajan Singh to Rajya Sabha: టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.

Harbhajan Singh: రాజ్యసభకు క్రికెటర్ హర్భజన్ సింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ
Harbhajan Singh
Balaraju Goud
|

Updated on: Mar 17, 2022 | 6:44 PM

Share

Harbhajan Singh to Rajya Sabha: టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. అతనికి పంజాబ్(Punjab) ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ కమాండ్ కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagawant Mann) తన హయాంలో పంజాబ్‌లో క్రీడలను చాలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. జలంధర్‌లో స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఉద్ఘాటించారు. ఇప్పుడు హర్భజన్ సింగ్‌ను త్వరలోనే రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్ స్వయంగా భజ్జీతో చర్చలు జరిపి రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు సమాచారం. కాగా, గతేడాది హర్భజన్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. భగవంత్ మాన్ పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసం సీఎం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆప్ తరుఫున మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఐదు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అందులో ఒక స్థానానికి భజ్జీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

హర్భజన్‌ సింగ్ తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి 2021 డిసెంబర్ మాసంలో వీడ్కోలు పలికారు. 1998లో భారత్ జట్టులోకి వచ్చిన హర్భజన్.. 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 417 టెస్టు వికెట్లు పడగొట్టిన భజ్జీ.. వన్డేల్లో 269, టీ20ల్లో 25 వికెట్లు తీశారు. చివరిగా భారత్ తరఫున 2016 మార్చి 3న యూఏఈతో టీ20 మ్యాచ్‌లో ఆడారు. 2016 నుంచి వీడ్కోలు మ్యాచ్‌ కోసం భజ్జీ ఎదురుచూసినా.. భారత సెలెక్టర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

ఇదిలావుంటే, ఈ నెలాఖరులోగా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభకు ఐదు సీట్లు రాబోతున్నాయి. ఇందులో హర్భజన్ సింగ్ మొదటి పేరును ఆమ్ ఆద్మీ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హర్భజన్ పేరుపై చాలా కాలంగా ఊహాగానాలు సాగుతున్న విషయం కూడా ఇక్కడ తెలుసుకోవాలి. స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు గురించి ఆప్ మాట్లాడినప్పటి నుండి, హర్భజన్ పేరు రేసులో ముందంజలో ఉన్నారు.

హర్భజన్ భగవంత్ మాన్‌కి సన్నిహితుడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్భజన్ సింగ్ సన్నిహిత మిత్రులుగా పేరుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించినప్పుడు కూడా, హర్భజన్ సింగ్ ట్వీట్ చేయడం ద్వారా భగవంత్ మాన్‌ను అభినందించారు. మరోవైపు, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొదటిసారిగా, AAP పంజాబ్‌లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఎన్నికల పోరులో అనేక మంది అనుభవజ్ఞులను ఓడించింది. ఈ ఎన్నికల్లో 117 స్థానాల్లో ఆప్ 92 సీట్లు గెలుచుకుంది. ఈ తుఫాను పంజాబ్ ప్రతి ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది. తాజా మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన రెండు స్థానాలను కోల్పోయారు. పీసీసీ చీఫ్ సిద్ధూ తన స్థానాన్ని కోల్పోయారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాష్ సింగ్ బాదల్ కూడా ఓటమిని ఎదుర్కొన్నారు.

Read Also…. 

Bhagwant Mann: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. అవినీతి అరికట్టేందుకు వ్యక్తిగత వాట్సాప్ నంబర్‌ విడుదల.. ఎప్పటినుంచంటే?