Meghalaya High Court: అలా చేయడం కూడా అత్యాచారమే అవుతుంది.. మేఘాలయ హైకోర్టు సంచలన తీర్పు

ఓ మైనర్​పై అత్యాచారం కేసులో మేఘాలయ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (Meghalaya High Court) కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననేంద్రియాలను లో దుస్తుల పై నుంచి పురుషాంగంతో తాకినా.. దానిని...

Meghalaya High Court: అలా చేయడం కూడా అత్యాచారమే అవుతుంది.. మేఘాలయ హైకోర్టు సంచలన తీర్పు
Justice
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 17, 2022 | 6:51 PM

ఓ మైనర్​పై అత్యాచారం కేసులో మేఘాలయ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (Meghalaya High Court) కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననేంద్రియాలను లో దుస్తుల పై నుంచి పురుషాంగంతో తాకినా.. దానిని అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించింది. ఇది పెనట్రేటివ్​సెక్స్​కిందికి వస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​సంజీవ్​ బెనర్జీ నేతృత్వంలోని డివిజనల్​బెంచ్​పేర్కొంది. మహిళ యోని లేదా మూత్రనాళంలోకి ఏదైనా చొప్పించడం శిక్షా స్మృతిలోని సెక్షన్​375(బి) ప్రకారం అత్యాచారమే (Rape) అవుతుందని తీర్పు వెలువరించారు. 2006 లో తనపై అత్యాచారం జరిగిందని పదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఈ క్రమంలో 2018 లో స్థానిక కోర్టు.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ ట్రయల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ నిందితుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. తన వాదనను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, బాలికపై లైంగిక చర్యకు పాల్పడలేదని, లో దుస్తుల పై నుంచి పురుషాంగంతో తాకానని వాదించారు. ఇతడి వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. నిందితుడు శిక్షార్హుడేనని పేర్కొంది.

గతంలోనూ నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఓ బాలిక దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని పేర్కొంటుందంటూ అప్పట్లో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని వెల్లడించింది. ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్‌ నిరూపితం కానందున ఈ చర్య పోక్సో చట్ట పరిధికి రాదని, నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోలేమని తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పేర్కొన్నారు. తాజాగా ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.

Also Read

Harbhajan Singh: రాజ్యసభకు క్రికెటర్ హర్భజన్ సింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ

Aditi Rao Hydari: ట్రేడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న మిల్కీ వైట్ టోన్డ్ స్కిన్ బ్యూటీ అదితిరావ్ హైదరి….

Holi 2022: రంగుల పండగలను..అందమైన, సులభమైన రంగోలి డిజైన్‌లతో అలంకరించుకోండి ఇలా.. సింపుల్ ఐడియాస్ మీకోసం