Jayalalitha: జయలలిత, శోభన్ బాబు నా తల్లిదండ్రులు.. నాకు వారసత్వ ధ్రువపత్రం ఇవ్వండి

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు వారసురాలు ఎవరనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మారింది. ఆమె వారసులం తామే అంటూ ఇప్పటి వరకూ ఎంతో మంది మీడియా ముందుకు వచ్చారు....

Jayalalitha: జయలలిత, శోభన్ బాబు నా తల్లిదండ్రులు.. నాకు వారసత్వ ధ్రువపత్రం ఇవ్వండి
Jayalalitha
Follow us

|

Updated on: Mar 17, 2022 | 6:21 PM

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు వారసురాలు ఎవరనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మారింది. ఆమె వారసులం తామే అంటూ ఇప్పటి వరకూ ఎంతో మంది మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో జయలలిత (Jayalalitha) వారసురాలిని తానేనంటూ, తనకు వారసత్వ ధృవీకరణ పత్రం ఇవ్వాలని ఓ మహిళ అధికారులను సంప్రదించడం ఆసక్తికరంగా మారింది. తమిళనాడు (Tamilanadu) లోని మదురై తిరువళ్లువర్‌ నగర్‌కు చెందిన మురుగేశన్‌ భార్య మీనాక్షి.. తన తండ్రి శోభన్‌బాబు, తల్లి జయలలిత అని, చెన్నై (Chennai) పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న తన తల్లి మృతి చెందినందున తనకు వారసత్వ సర్టిఫికేట్‌ ఇవ్వాలని జనవరి 27న దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మదురై తాలూకా కార్యాలయ అధికారులు షాక్ అయ్యారు.

దరఖాస్తు చేసుకుని నెల దాటడంతో మంగళవారం మీనాక్షి తాలూకా కార్యాలయానికి వచ్చి, డిప్యూటీ తహసీల్దారు వద్ద వారసత్వ సర్టిఫికేట్‌ ఇవ్వాలని కోరారు. తన తల్లి అని చెబుతున్న జయలలిత.. చెన్నైలో మృతి చెందారని, కాబట్టి అక్కడికెళ్లి తీసుకోవాలని సూచించారు. అధికారుల సమాధానంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మీనాక్షి.. తన తల్లిదండ్రులు తనను అనాధగా వదిలి వెళ్లారని, పళనిలో బంగారు రథం లాగే హక్కు తన తండ్రి శోభన్‌బాబు తనకు ఇచ్చారని, దానికి సంబంధించిన పత్రాలు పొందానని, అయితే వారసత్వ సర్టిఫికేట్‌ ఎందుకు ఇవ్వటం లేదని వాగ్వాదానికి దిగారు. దీంతో తాలూకా కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. కోర్టుకు వెళ్లి మీ హక్కులు మీరు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్‌ మీనాక్షిని అక్కడి నుంచి పంపించేశారు. తన చిన్న తనంలోనే తన తల్లి తనను దూరం చేసుకుందని మీనాక్షి తెలిపారు. తానే జయలలిత నిజమైన వారసురాలినని, కోర్టుకు వెళ్లటం గురించి లాయర్ ను సంప్రదిస్తానన్నారు.

గతంలో జయలలిత నివాసాన్ని స్మారక మందిరంగా మార్చాలన్న ప్రయత్నాలకు మద్రాస్ హైకోర్టు అడ్డుచెప్పింది. చెన్నైలోని పొయెస్ గార్డెన్ లో ఉన్న జయలలిత ఇంటిని స్మారక మందిరంగా మార్చేందుకు అప్పట్లో అన్నాడీఎంకే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ కోర్టును ఆశ్రయించారు. వారు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పొయెస్ గార్డెన్ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు వీల్లేదని, ఆ ఇంటిని జయలలిత మేనకోడలు, చట్టబద్ధ వారసురాలు దీపకు అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Also Read

SC Railway: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. రూ. 10,000 కోట్ల ఆదాయం..

TS Govt Jobs: నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడకండి.. మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Tata UPI Payments: టాటా నుంచి యూపీఐ పేమెంట్ యాప్‌.. ఎన్‌పీసీఐ క్లియరెన్స్ కోరుతూ దరఖాస్తు..!