Bhagwant Mann: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. అవినీతి అరికట్టేందుకు వ్యక్తిగత వాట్సాప్ నంబర్ విడుదల.. ఎప్పటినుంచంటే?
Punjab CM Bhagwant Mann: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధికార పగ్గాలు చేపట్టగానే పాలనలో దూకుడు పెంచారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి అడుగు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు.
Punjab CM Bhagwant Mann: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధికార పగ్గాలు చేపట్టగానే పాలనలో దూకుడు పెంచారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి అడుగు అవినీతి(Anti Corruption) అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం భగత్‌సింగ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్ ప్రజలు అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను వాట్సాప్‌లో పంపాలని సూచించారు. ఇందుకు ప్రత్యేక నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు నా పర్సనల్ వాట్సాప్ నంబర్(WhatsApp) అక్కడ ఉంటుందని సీఎం భవంత్ మాన్ ట్వీట్ చేశారు. ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే దాన్ని వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేసి నాకు పంపండి. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో మార్చి 23న మరో ప్రత్యేక నంబర్‌ను విడుదల చేస్తామని భగవంత్ మాన్ తెలిపారు. 99% మంది నిజాయితీపరులు, 1% మంది వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిజాయితీపరులైన అధికారులకు నేనెప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. ఇప్పుడు పంజాబ్‌లో వారం రికవరీ ఆగిపోతుంది. వారంతా రికవరీ కోసం ఏ నాయకుడూ ఏ అధికారిని వేధించరని సీఎం భగవంత్ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. పంజాబ్‌లో ఇకపై అవినీతికి అంతమే అన్నారు.
पंजाब के लोगों को बहुत बहुत बधाई। अब पंजाब में रिश्वतख़ोरी नहीं चलेगी। https://t.co/tEEN9WJQdG
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 17, 2022
ఈ ప్రకటనకు ముందు, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్వీట్ చేస్తూ, “పంజాబ్ ప్రజల ప్రయోజనాల కోసం ఈ రోజు చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాం. పంజాబ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండరు. త్వరలో ప్రకటిస్తాను. అంటూ పంజాబ్ సీఎం ట్వీట్ చేశారు.
भगत सिंह जी के शहीदी दिवस पर, हम anti-corruption हेल्पलाइन नम्बर जारी करेंगे। वो मेरा पर्सनल वॉट्सऐप नंबर होगा। अगर आपसे कोई भी रिश्वत मांगे, उसकी वीडियो/ऑडियो रिकॉर्डिंग करके मुझे भेज देना। भ्रष्टाचारियों के ख़िलाफ़ सख्त एक्शन लिया जाएगा।
पंजाब में अब भ्रष्टाचार नहीं चलेगा।
— Bhagwant Mann (@BhagwantMann) March 17, 2022
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించడంతో భగవంత్ మాన్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన్ తన ప్రసంగంలో, “పంజాబ్‌లోని తన పార్టీ ప్రభుత్వం నిరుద్యోగం, అవినీతి, రైతుల దుస్థితి వంటి సమస్యలను పరిష్కరించడానికి పని చేస్తుంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పరిస్థితిని మెరుగుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read Also…. Russia Ukraine Crisis: భారత్ వైఖరి అమెరికాతో సంబంధాలను ప్రభావితం చేయదు.. యుఎస్ కాన్సుల్ జనరల్ సుస్పష్టం