Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!

Viral Video: కొన్ని కొన్ని నమ్మశక్యం కాకుండా ఉంటాయి. కళ్లు ముందే జరిగినా.. వాటిని నమ్మలేని పరిస్థితి ఉంటుంది. అంతలా షాక్‌కు గురి చేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!
Auto Rickshaw
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 17, 2022 | 9:12 PM

Viral Video: కొన్ని కొన్ని నమ్మశక్యం కాకుండా ఉంటాయి. కళ్లు ముందే జరిగినా.. వాటిని నమ్మలేని పరిస్థితి ఉంటుంది. అంతలా షాక్‌కు గురి చేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. డ్రైవర్ లేడు, బండి ఆన్‌ చేసి కూడా లేదు. కానీ, దానంతట అదే స్టార్ట్ అయి.. ఒకటి కాదు.. రెండు కార్లును ఢీకొట్టింది. ఎవరో కక్షగట్టి మరీ గుద్దినట్లుగా ఢీకొట్టింది. ఈ షాకింగ్ సీన్ అంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెలా సాధ్యమైందంటూ ఆశ్చర్యపోతున్నారు. దెయ్యం ఏమైనా రివేంజ్ తీసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. రోడ్డు పక్కన ఓ ఈ-రిక్షా పార్క్ చేసి ఉంది. పక్క నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో రోడ్ సైడ్ పార్క్ చేసిన ఈ రిక్షా కదలింది. డ్రైవర్ లేకుండా అది రయ్‌మంటూ ముందుకు దూసుకెళ్లింది. చుట్టూ తిరుగుతూ అటు పక్కనే పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. డ్రైవర్ లేకుండా పరుగులు తీస్తున్న ఈ రిక్షాను పట్టుకునేందు అక్కడ ఉన్న వ్యక్తి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. మొదట ఒక కారును ఢీకొన్న ఈ రిక్షా.. ఆ తరువాత పక్కనే ఉన్న మరో కారును కూడా ఢీకొట్టింది. ఆ తరువాత గానీ అది ఆగిపోయింది. ఈ దృశ్యమంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. డ్రైవర్ లేకుండా అది పరుగులు తీయడం.. రెండు కార్లను ఢీకొట్టడం చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. డ్రైవర్ లేకుండా ఎలా స్టార్ట్ అయ్యిందంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. దెయ్యం ఏమైనా ఇలా చేసిందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. దెయ్యమే ఈ విధంగా కార్లపై రివేంజ్ తీసుకుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

Also read:

Krithi Shetty: కుర్రహీరోయిన్‌కి క్యూకడుతున్న క్రేజీ ఆఫర్స్.. ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..

Govardhan: ఆవు పేడ కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా

IPL 2022: ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ ఎప్పటికీ పోటీ రాదు.. ఏం చేసినా అది సాధ్యం కాదు.. రమీజ్‌ రజా వ్యాఖ్యలపై చోప్రా విసుర్లు..