ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార కృతిశెట్టి.
1 / 8
మొదటి సినిమాతో తెలుగు కుర్రకారుల మనస్సులను కొల్లగొట్టిన ఈ చిన్నది వరుస అవకాశలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.
2 / 8
ఇప్పటికే నానితో ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల్లో నటించింది.
3 / 8
ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో కృతి లక్కీ హీరోయిన్‌గా కూడా పేరు దక్కించుకుంది.
4 / 8
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలు ఉన్నాయి.
5 / 8
ఇక తాజాగా తెలుస్తోన్న సమాచారం కృతిశెట్టి భారీ ఆఫర్‌ను కొట్టేసినట్లు తెలుస్తోంది.
6 / 8
ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
7 / 8
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా వీరిలో కృతిశెట్టి ఒకరనే చర్చ నడుస్తోంది.