Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govardhan: ఆవు పేడ కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా

Govardhan: ఆవు వ్యర్ధాల(cow dung) నుంచి సేంద్రీయ ఎరువుల తయారీని ( organic manure ), వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం పోత్సహిస్తుంది. అయితే ఆవు పేడ కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల..

Govardhan: ఆవు పేడ కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా
Organic Manure Govardhan
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2022 | 9:10 PM

Govardhan: ఆవు వ్యర్ధాల(cow dung) నుంచి సేంద్రీయ ఎరువుల తయారీని ( organic manure ), వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం పోత్సహిస్తుంది. అయితే ఆవు పేడ కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం.. పేడ ,  వ్యవసాయ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్, సేంద్రీయ ఎరువులుగా మార్చగల ప్రాజెక్టులకు సహాయం చేయడానికి ఒక నిబంధన చేయబడింది.

జంతువుల వ్యర్థాలను (పేడ) రైతులకు,  పశువుల యజమానులకు ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆవు పేడను అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం సేకరిస్తుంది. అయితే ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఆవు పేడను కొనుగోలు చేసే విధానం ఇంకా రూపొందించలేదు. ఈ విషయమై కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ.. రైతుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆవు పేద కొనుగోలు విషయంలో పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. ఇటీవల లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాచారం ఇచ్చారు.

వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేసిన సేంద్రియ ఎరువు వాడకాన్ని ‘గోవర్ధన్’ ద్వారా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇటీవల లోక్‌సభలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా పంచుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సహాయం చేయడానికి, పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి సేంద్రీయ ఎరువుల తయారీ, ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి తాగునీటి , పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ గోవర్ధన్ ప్రాజెక్ట్ అనే బహుళ-ఏజెన్సీ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. ఇది త్వరలో అమలులోకి రానుంది.

4 డైరీ ప్లాంట్లలో ఆవు పేడ: లోక్‌సభలో సమాచారాన్ని పంచుకుంటూ, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి  పురుషోత్తం  రూపాలా మాట్లాడుతూ..  ఆవు పేడ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు గుజరాత్ రాష్ట్రంలో  ఆనంద్ జిల్లాలోని ముజ్కువా,  జకరియాపురా గ్రామాల్లో కంపోస్ట్ చైన్‌పై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి) విజయవంతమైన పైలట్ మోడల్‌ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఉంది. పశువుల పేడను బయోగ్యాస్ , బయో-ఎరువుగా మార్చడం ద్వారా ఆ గ్రామం పరిశుభ్రమైన, ఆర్థికంగా బలమైన భవిష్యత్తు వైపు పయనిస్తోంది.

అంతే కాకుండా బనస్కాంత జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కూడా ఆవు పేడ , వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి సహకార డెయిరీలు, పారిశ్రామికవేత్తల ద్వారా పశువుల పేడ బయోగ్యాస్ ప్లాంట్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆవు పేడ, వ్యవసాయ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్, ఆర్గానిక్ ఎరువులుగా మార్చే ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read: Russia Ukraine War: యుద్ధం మిగిల్చిన విషాదం.. ఇప్పటికి 14 వేల మంది రష్యా సైనికులు మృతి..!