Guava Leaf: జామ ఆకుతో కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? అమ్మో..! అస్సలు గెస్ చేయలేం
పేదోడి యాపిల్‌గా జామపండుకు పేరుంది. అయితే ప్రకృతి వైద్యంలో జామ పండ్లతోపాటు చెట్టుకు సంబంధించిన ప్రతీది వాడతారు. నొప్పులు, వాపులను తగ్గించే ఔషధ గుణాలు జామ ఆకులో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Guava Leaf Benefits: పేదోడి యాపిల్‌గా జామపండుకు పేరుంది. అయితే ప్రకృతి వైద్యంలో జామ పండ్లతోపాటు చెట్టుకు సంబంధించిన ప్రతీది వాడతారు. నొప్పులు, వాపులను తగ్గించే ఔషధ గుణాలు జామ ఆకులో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జామాకుల్లో పుష్కలంగా ఆరోగ్య విలువులు ఉంటాయి. ఇవి చర్మ నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చర్మ సమస్యలను జామ ఆకు నివారిస్తుంది. జామాకులతో చేసే ప్యాక్స్ ఎంతగానో సహయపడతాయి. జామాకుల చట్నీ, ఇంకా జామాకుల టీ ఇలా రెండు రెసపీస్ చేసుకోవచ్చు. జామాకుల వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
- జలుబు, దగ్గు, ఊపిరి సమస్యలు, పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటిపూత లాంటి ఎన్నో సమస్యలను నయం చేస్తుంది
- జామాకులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడం లో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.
- జామాకులు డైజెస్టివ్ ఎంజైంస్ బాగా ప్రొడ్యూస్ అయ్యేలా వాటిని స్టిమ్యులేట్ చేసి అరుగుదల కి సహకరిస్తాయి.
- జామ ఆకుల రసం తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
- పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొత్తికడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నొప్పి తగ్గాలంటే జామ ఆకుల రసం తాగితే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు
- జామాకులు మంచి లివర్ టానిక్ లా పని చేస్తాయి. రెగ్యులర్ గా జామాకుల టీ తాగితే చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్ తగ్గుతాయన్నది నిపుణుల వెర్షన్
- ఇది మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- జామ లో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన పంటి నొప్పి, నోటి పుళ్ళు నుండి రిలీఫ్ లభిస్తుంది
- జామాకుల టీ స్పెర్మ్ ప్రొడక్షన్ లో కూడా హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- జామపండ్లు తింటే అరిగించుకునే కెపాసిటీ పెరుగుతుందని చెబుతారుౌ
- ఐదారు ఆకుల నుంచి రసాన్ని తీసి తాగితే శరీరానికి అవసరమయ్యే ఫైబర్‌లో 12 శాతం భర్తీ అవుతుందట
- జామ ఆకుల్లో విటమిన్–సి ఎక్కువగా ఉంటుంది. ఇది జబ్బులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
- జామ ఆకుల్లో క్యాన్సర్‌ను రాకుండా చేసే గుణాలున్నాయి. అంతేకాదు క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా అడ్డుకుంటుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
Also Read: వంటింట్లో ఉండే ఇంగువతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే.. మీరు ముక్కున వేలేసుకుంటారు