Gangapayala Aaku: ఈ మొక్క కనిపిస్తే పిచ్చి మొక్క అనుకోకండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Gangapayala Aaku: ప్రకృతి ప్రసాదం మొక్కలు. మన చుట్టూ ఉన్న మొక్కల్లో చాలా వాటిని పిచ్చి మొక్కలు అనుకుని పట్టించుకోము. కానీ పల్లెటూర్లలో, పొలాల గట్ల మీద పెరిగే మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి..

Gangapayala Aaku: ఈ మొక్క కనిపిస్తే పిచ్చి మొక్క అనుకోకండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
Gangapayala Aaku
Follow us

|

Updated on: Mar 17, 2022 | 9:39 PM

Gangapayala Aaku: ప్రకృతి ప్రసాదం మొక్కలు. మన చుట్టూ ఉన్న మొక్కల్లో చాలా వాటిని పిచ్చి మొక్కలు అనుకుని పట్టించుకోము. కానీ పల్లెటూర్లలో, పొలాల గట్ల మీద పెరిగే మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి (Medicinal Plants). అలా పొలం గట్లమీద నెల మీద పాకుతూ పెరిగే ఓ మొక్క గంగ పాయల ఆకు. ఈ మొక్కను దాదాపుగా అందరు చూసే ఉంటారు.  మొక్క కాడలు ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. పసుపు పచ్చ పూలు పూస్తాయి. గంగ పావిలి కూర పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగుతుంది. దీనిని గంగ పాయ, గోళీ కూర అని కూడా అంటారు. సన్న పాయల, పుల్ల పాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల అని నాలుగు రకాలు ఉన్నాయి. గంగ పావిలి ఆకుతో కూర, పప్పు చేసుకుంటారు. ఈ ఆకులో చాలా పోషకాలు ఉన్నాయి. గంగపాయల ఆకు కూర ఇచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

  1. గంగపాయల ఆకులో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. అంతేకాదు ఒమేగా ౩ ఫాటి ఆమ్లాలు, విటమిన్ A ,విటమిన్ బి పీచు పదార్ధాలు, ఐరన్ ,పొటాషియం ,కాల్షియంలతో పాటు యాంటి ఆక్సిడెంట్ లు ఉన్నాయి.
  2. దీనిలోని ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు మన శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది. రక్త ప్రహవానికి అడ్డు వచ్చే చెడు కొలెస్ట్రాల్ లేకపోవటం వలన గుండెకు మేలు జరుగుతుంది.
  3.  దీనిలోని జింక్ అధికంగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది
  4. కాల్షియం ,పొటాషియం అధికంగా ఉన్నాయి. దీంతో ఎముకలు ధృడంగా పెరుగుతాయి.
  5. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది
  6. ఈ మొక్కలో ఉండే విటమిన్‌ ఎ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
  7. ఈ ఆకులో కేలరీలు తక్కువ పీచు పదార్ధం ఎక్కువగా ఉన్నాయి. దీంతో జీర్ణక్రియ బాగుంటుంది.
  8. ఈ ఆకులను ముద్దగా నూరుకుని రసం తీసి పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి.
  9. ఈ ఆకులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకుకూర తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
  10. తరచూ ఈ ఆకులు ఏదో విధంగా ఆహారంగా తీసుకోవడం వలన ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

Also Read: Guava Leaf: జామ ఆకుతో కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? అమ్మో..! అస్సలు గెస్ చేయలేం

Guava Leaf: జామ ఆకుతో కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? అమ్మో..! అస్సలు గెస్ చేయలేం

Govardhan: ఆవు పేడ కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా