Health Tips: మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందా? అయితే, ఈ 4 ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..

Health Tips:   ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాలన్నా మనం తినే ఆహారానిదే కీలక పాత్ర జం్ ఫుడ్స్, బాగా వేయించిన ఫుడ్స్

Health Tips: మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందా? అయితే, ఈ 4 ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..
High Cholesterol
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 18, 2022 | 8:37 PM

Health Tips:   ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాలన్నా మనం తినే ఆహారానిదే కీలక పాత్ర జం్ ఫుడ్స్, బాగా వేయించిన ఫుడ్స్, అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిని తినడం వలన ముఖ్యంగా  శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. అలాగే, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే తినే ఆహారంపై కొద్దిగా శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నచ్చిన ఫుడ్ అని, ఏది పడితే అది తింటే చివరాఖరకు ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. శరీరంలో కొవ్వు  పేరుకుపోతే.. రక్త నాళాల్లో రక్తం సరఫరాలకు అంతరాయం ఏర్పడి.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు డెసిలీటర్‌కు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మనం రోజూ తినే ఆహారంలో 4 రకాల ఆహార పదార్థాలను తినకుండా ఉంటే కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ హెల్త్ నివేదిక చెబుతోంది. మరి ఆ నాలుగు రకాల ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏం తినకూడదు..

మాంసం: చాలా మందికి మాంసం అంటే చాలా ఇష్టం. మాంసం తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగే ఛాన్స్ అధికంగా పేరుకుంటుంది. మాంసంలో సంత‌ృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. మాంసాహారాన్ని మితంగా తింటే.. శరీరంలో కొవ్వును తగ్గించుకోవచ్చు. కొవ్వులు అధికంగా ఉండే మాంసం కన్నా.. స్కిన్‌లెస్ చికెన్, టర్కీ బ్రెస్ట్, చేపలు, బీన్స్ వంటి అధిక-ప్రోటీన్ తక్కువ-కొవ్వు కలిగిన ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది.

ఫ్రై చేసిన ఫుడ్స్: వేయించిన ఆహారాలను తినడం వలన కూడా ఒంట్లో కొవ్వు పేరుకుంటుంది. చిప్స్, పాపడాలు, సమోసా, బజ్జీలు, ఫ్రైడ్ రైస్, మసాలా ఆహారాలు తినడం తగ్గించడం ద్వారా కొవ్వును తగ్గించుకోవచ్చు.

ప్రాసెస్ చేసిన మాంసాహారం: ప్రస్తుత కాలంలో ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌నే జనాలు ఎక్కువగా తింటున్నారు. టేస్టీగా ఉన్నాయని కుమ్మేస్తే.. ఆ తరువాత ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తినడం ప్రమాదకరం.

ఒవెన్‌లో వేడి చేసిన ఫుడ్స్: యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ స్టాక్ ఫుడ్స్‌ని వేడి చేసుకుని మరీ తింటారు. ముఖ్యంగా బేరీ ఫుడ్స్‌కు విపరీతంగా అలవాటు పడిన వారు ఉంటారు. కేక్‌లు, డోనట్స్, పిజ్జాలు, బర్గర్లు, పఫ్‌లు వంటి ఫుడ్స్ అధికంగా తింటారు. వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగే ప్రమాదం ఉందని, వీటికి దూరంగా ఉంటే ఆరోగ్య ప్రయోజనం ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ నివేదికలో పేర్కొన్నారు ఆరోగ్య నిపుణులు.

Also read:

Spinal Cord Surgery: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. బాలుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్స్..!

Summer Health Tips: వేపవి కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణుల సూచనలు మీకోసం..

Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!