AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Tips: వేపవి కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణుల సూచనలు మీకోసం..

Summer Health Tips: వేసవి వచ్చేసింది. ప్రతి సీజన్‌ మాదిరిగానే.. ఈ సీజన్‌లోనూ మనల్ని వేధించే వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి. ఎండాకాలంలో చికన్‌ఫాక్స్ వంటి అనేక రకాల వైరల్‌ ఫీవర్‌లు రావడం సర్వసాధారణం.

Summer Health Tips: వేపవి కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణుల సూచనలు మీకోసం..
Summer Health Tips
Shiva Prajapati
|

Updated on: Mar 17, 2022 | 6:22 PM

Share

Summer Health Tips: వేసవి వచ్చేసింది. ప్రతి సీజన్‌ మాదిరిగానే.. ఈ సీజన్‌లోనూ మనల్ని వేధించే వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి. ఎండాకాలంలో చికన్‌ఫాక్స్ వంటి అనేక రకాల వైరల్‌ ఫీవర్‌లు రావడం సర్వసాధారణం. అందువల్ల, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వేసవిలో తినే ఆహారం.. ఇతర సీజన్‌లలో తినే ఆహారాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వేసవిలో డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారం, ద్రవ పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

1. దాహం వేసేంత వరకు వేచి చూడకుండా ఎప్పటికప్పుడు మంచి నీరు తాగాలి. రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు నీరు తాగాలి. 2. నిమ్మరసం, గంజి నీరు, మెరినేడ్ నీరు, జీలకర్ర జ్యూ్స్ వంటి పోషక ప్రయోజనాలతో కూడిన నీటిని పుష్కలంగా తాగాలి. 3. కడుపు నిండా తినకుండా.. విరామం ఇస్తూ కొంచె కొంచె భోజనం తినడం ఉత్తమం. 4. తినే ఆహారంలో నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. 5. చర్మ వ్యాధులు, విటమిన్ లోపాన్ని తగ్గించుకునేందుకు పండ్లు తినాలి. 5. సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ, ముసాంబి), పుచ్చకాయ, దానిమ్మ, సీతాఫలాలను వేసవి డైట్‌లో చేర్చండి. పైనాపిల్ కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. మామిడి పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు ధరిచేరవు. 6. సూర్యరశ్మి వల్ల చర్మంపై ఏర్పడే గడ్డలను తగ్గించడంలో బొప్పాయి సహాయపడుతుంది. మధ్యమధ్యలో వెజిటబుల్ సలాడ్ తినడం తప్పనిసరి. 7. అధిక కొవ్వు పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కృత్రిమ పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. 8. కారం, పులుపు అధికంగా ఉండే ఆహార పదార్థాల వాడకం తగ్గించాలి. వీటిని ఎక్కువగా వాడటం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. 9. టీ, కాఫీ బదులు.. పండ్ల రసాలు, కూరగాయల సూప్‌లు తీసుకోవచ్చు. 10. వేసవిలో మీ శరీరం కళావిహీనంగా కాకుండా, కాంతివంతంగా మార్చేందుకు మంచినీళ్లు బాగా తాగాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా తాగితే దాహం, అలసట సమస్య తీరుతుంది. 11. మాంసం, గుడ్లు ఫ్రై తినడం కూడా తగ్గించడం ఉత్తమం. 12. పంచదార, స్వీట్ ఫుడ్స్ తినడం తగ్గించాలి. 13. వేసవిలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. 14. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. 15. ప్రతి రోజూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా ఉండొచ్చు.

Also read:

curd: పెరుగుతో ప్రయోజనాలే కాదు ప్రమాదాలు కూడా.. రాత్రి పూట పెరుగు తింటే..

Prithvi shaw: ఆ పరీక్షలో ఫెయిలైన పృథ్వీ షా.. ట్రోల్ చేస్తున్న నేటిజన్లు..

Ananya Nagalla: యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో చేరిన హీరోయిన్ ‘అనన్య నాగల్ల’ కొత్త ఫొటోస్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న బ్యూటీ..