curd: పెరుగుతో ప్రయోజనాలే కాదు ప్రమాదాలు కూడా.. రాత్రి పూట పెరుగు తింటే..

సమ్మర్ వచ్చేసింది.. మార్చి మొదలవగానే భానుడి భగభగలు కూడా మొదలయ్యాయి. సమ్మర్ లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

curd: పెరుగుతో ప్రయోజనాలే కాదు ప్రమాదాలు కూడా.. రాత్రి పూట పెరుగు తింటే..
Curd
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 17, 2022 | 5:54 PM

curd: సమ్మర్ వచ్చేసింది.. మార్చి మొదలవగానే భానుడి భగభగలు కూడా మొదలయ్యాయి. సమ్మర్ లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఎండాకాలంలో చిన్నచిన్న చిట్కాలతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక సమ్మర్ లో ఎక్కువ మంది పెరుగు, మజ్జిగల పై ఆధారపడి ఉంటారు. శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా ఉండేందుకు ఎక్కువగా పెరుగు, మజ్జిగలను తీసుకుంటూ ఉంటారు. పెరుగు ఇమ్యూనిటీని స్ట్రాంగ్‌గా చేస్తుంది అంటారు వైద్యులు. అంతే కాదు పెరుగు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలని బలంగా ఉంచుతుంది, జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది పెరుగు. అంతే కాదు పెరుగు ఎక్కువ తినడం వల్ల బరువుకూడా కంట్రోల్ లో ఉంటుందట. అయితే పెరుగును ఇష్టమొచ్చినట్టు తినకుందట.. పెరుగు ఎంత తీసుకోవాలి.. ఏ ఏ సమయాల్లో తీసుకోవాలి అనేది మనం తప్పక తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు.

అయితే పెరుగుతో మేలు మాత్రమే కాదు కొంత చేటు కూడా ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పెరుగుని ఎప్పుడూ వేడి చేయకూడదట. పెరుగు వేడి చేయడం వల్ల అందులో ఉన్న సుగుణాలన్నీ పోతాయి. పెరుగుని ప్రతి రోజు తీసుకోకూడదు. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు అస్సలు తినకూడదు అంటున్నారు నిపుణులు. అలాగే కొంతమంది పెరుగులో అరటి పండు, మామిడి పండు , దానిమ్మ వంటివి కలుపుకొని తింటుంటారు. కానీ పెరుగుని ఎలాంటి పండ్లతో కలిపి తీసుకోకూడదు. వీటితోపాటు చికెన్, మాంసం, చేపలతో కలిపి పెరుగు తీసుకోకూడదు. ఇక బరువు ఎక్కువగా ఉన్న వారు, ఇంఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నవారు, బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్న వారు పెరుగు తీసుకోకూడదట. పెరుగుని  మధ్యాన్నం పూట మాత్రమే తినాలట. అయితే పెరుగు ఎక్కువగా తినాలి అనుకునే వారు మజ్జిగ తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ఆ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మే నాకు స్ఫూర్తి.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. టికెట్స్ రేట్స్ విషయంపై..