Health News: డిమ్ లైట్‌లో నిద్రపోతున్నారా? అయితే, మీకోసమే ఈ షాకింగ్ న్యూస్..!

Health News: డిమ్ లైట్‌లో నిద్రపోయే వారికి ఇది నిజంగా షాకింగ్ వార్త. కొత్త అధ్యయనం ప్రకారం.. టెలివిజన్ లైట్, నైట్‌లైట్, డిమ్ వెలుతురుతో

Health News: డిమ్ లైట్‌లో నిద్రపోతున్నారా? అయితే, మీకోసమే ఈ షాకింగ్ న్యూస్..!
Sleeping
Follow us

|

Updated on: Mar 19, 2022 | 6:54 AM

Health News: డిమ్ లైట్‌లో నిద్రపోయే వారికి ఇది నిజంగా షాకింగ్ వార్త. కొత్త అధ్యయనం ప్రకారం.. టెలివిజన్ లైట్, నైట్‌లైట్, డిమ్ వెలుతురుతో నిద్రపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో పాటు.. హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుందట.

కాంతి మన శరీరంలో జీవ క్రియను నిర్వహించడానికి సహకరిస్తుంది. ఇది హార్మోన్ల విడుదల వంటి జీవసంబంధమైన విధులను సమన్వయం చేస్తుంది. అయితే, రాత్రిపూట కృత్రిమ కాంతి(బెడ్ లైట్) మన సిర్కాడియన్ రిథమ్‌ను విచ్చిన్నం చేస్తుందట. విశ్రాంతికి విఘాతం కలిగిస్తుందట. బెడ్ లైట్ కాంతి మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొత్త పరిశోధనల్లో వెల్లడైంది.

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌ నివేదిక ప్రకారం.. శాస్త్రవేత్తలు 19 నుంచి 36 సంవత్సరాల వయస్సు గల 20 మందిపై రెండు రోజులు పరిశోధనలు జరిపారు. మొదటి రాత్రి వాలంటీర్లు చీకటి గదిలో నిద్రించారు. రెండవ రాత్రి డిమ్ లైట్(వీధి లైట్లు, టెలివిజన్ వెలుతురు, బెడ్ లైట్) ఉన్న గదిలో నిద్రించారు. ఈ పరిశోధనల్లో పాల్గొనే వారందరికీ నిద్ర నాణ్యతకు సంబంధించిన వివిధ స్థాయిలను కొలిచే పరికరాలను కనెక్ట్ చేశారు. ప్రతీ పరికరాన్ని IV ట్యూబ్‌తో అనుసంధానించారు. అవి నిద్రపోతున్నప్పుడు రక్తాన్ని పరీక్షిస్తాయి. పరిశోధకులు వ్యక్తిని నిద్ర లేపకుండానే నమూనాలను సేకరించడానికి వీలు ఉంటుంది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు.. హృదయ స్పందన రేటు, మెదడు స్పందన తీరును, హార్మోన్ల స్థాయిలను కూడా నమోదు చేశారు.

‘‘మెదడు తరంగాలను రికార్డ్ చేసాం. దీన్ని బట్టి వ్యక్తి ఏ నిద్ర దశలో ఉన్నాడో చెప్పగలం’’ అని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ ఫెయిన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ అధ్యయనకారులు ఫిల్లిస్ జీ తెలిపారు. ‘‘మేము వారి శ్వాసను, వారి హృదయ స్పందన రేటు, వారి EKGని రికార్డ్ చేసాం. వారు నిద్రిస్తున్నప్పుడు మెలటోనిన్ స్థాయిలను కొలవడానికి వారి నుండి రక్తాన్ని కూడా తీసుకున్నాం.’’ అని చెప్పారు.

‘‘వాలంటీర్లు ఉదయం మేల్కొన్నప్పుడు.. ఈ పరిశోధన బృందం రెండు వేర్వేరు పద్ధతులను ఉపయోగించి వారి రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించింది. ఒకటి మేల్కొన్న తర్వాత వ్యక్తి గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను రికార్డ్ చేశాం. మరొకటి ప్రజలకు గ్లూకోజ్ మోతాదును ఇవ్వడం, వారి ఇన్సులిన్ ప్రతిస్పందనను రికార్డ్ చేశాం.’’ అని తెలిపారు.

ఈ పరీక్షలో కీలక అంశాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. డిమ్ లైట్‌లో పడుకున్న వారిలో 25 శాతం ఎక్కువ ఇన్సులిన్ స్థాయిలను కలిగి ఉన్నారు. ఇది గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడానికి శరీరం కష్టపడుతుందనడానికి సంకేతంగా పేర్కొన్నారు పరిశోధకులు. అలాగే, డిమ్ లైట్‌లో నిద్రించిర వారు గాఢ నిద్రను ఆస్వాధించలేకపోయారని, వారిలో అధిక హృదయ స్పందన రేటు నమోదైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఇక చీకటిలో గదిలో నిద్రించే వారి రక్తంలో షుగర్ లెవల్స్‌లో పెద్దగా తేడా లేనట్లు గుర్తించామన్నారు.

‘‘చీకటి గదిలో నిద్రించిన వారు.. గాఢంగా నిద్రించారు. వారీ రక్తంలో, శరీంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, డిమ్ లైట్‌లో పడుకున్న వారు కూడా తాము గాఢంగా నిద్రపోయామని భావిస్తున్నారు. కానీ, వారి మెదడుకు ఆ లైట్ వెలుతురు తగులుతుంటుంది. వారి మెదడుకు లైట్ ఉందనే విషయం తెలుసు. ఈ లైట్.. శరీరం పనితీరును గందరగోళానికి గురి చేస్తుంది. డిమ్ లైట్ కారణంగా వృద్ధుల్లో టైప్ టూ మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, మహిళల్లో ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది.’’ అని పరిశోధకులు నికోలా డేవిస్ పేర్కొన్నారు.

అందుకే డిమ్‌ లైట్‌లో నిద్రించే వారు. స్లీప్ మాస్క్‌ని ధరించాలని పరిశోధకులు సిఫారసు చేస్తున్నారు. ఒకవేళ మీకు లైట్ అవసరం అయితే, ఆలైట్ ను బెడ్ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Also read:

Spinal Cord Surgery: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. బాలుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్స్..!

Summer Health Tips: వేపవి కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణుల సూచనలు మీకోసం..

Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!