Coconut Water Benefits: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఔరా అనాల్సిందే..

వేసవిలో రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండెపోటు, రక్తపోటు రెండూ అదుపులో ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

Coconut Water Benefits: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే  ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఔరా అనాల్సిందే..
Coconut Water Benefits
Follow us
Venkata Chari

|

Updated on: Mar 19, 2022 | 9:51 AM

కొబ్బరి నీరు(Coconut Water) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొబ్బరి నీళ్లను తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయం కూడా ఆరోగ్యం(health)గా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలోని అనేక రకాల టాక్సిన్స్ బయటకు వస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె(Heart Health) ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలంటే కొబ్బరి నీళ్లు కూడా తాగాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.

1- రక్తపోటు అదుపులో ఉంటుంది- మీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరి నీరు తాగితే, అది మీ రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును సాధారణంగా ఉంచడంలో సహాయపడుతుంది.

2- గుండెకు మేలు చేస్తుంది- కొబ్బరి నీరు కొలెస్ట్రాల్, ట్రై-గ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3- బరువును తగ్గిస్తుంది- ఇతర జ్యూస్‌లతో పోలిస్తే కొబ్బరిలో చక్కెర, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మీరు రోజూ 1 కప్పు కొబ్బరి నీరు తాగితే, అందులో 46 కేలరీలు ఉంటాయి. ఇది ఇతర పానీయాలతో పోలిస్తే చాలా తక్కువ. రోజుకు 3 నుంచి 4 సార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు.

4- రోగనిరోధక శక్తిని పెంచుతుంది- కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం లభిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా -19 రోగులు తప్పనిసరిగా కొబ్బరి నీటిని తాగాలి. అయితే కొబ్బరి నీటిని మాత్రం సాధారణ ఉష్ణోగ్రత వద్దే ఉండాలని గుర్తుంచుకోండి.

5- జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది- అతిసారం అంటే వాంతులు, విరేచనాలు కూడా కరోనా కొత్త లక్షణాలలో కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, మీరు కొబ్బరి నీరు తాగితే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, పేగుల్లో మంట, అల్సర్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!