AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oily Food: ఆయిల్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటే చాలా అనర్థాలు.. ఈ చిట్కాలు పాటిస్తే సేఫ్..!

Oily Food: మనం చాలాసార్లు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటాం. ఆ తర్వాత అలాంటి ఆహారాన్ని ఎందుకు తిన్నామో అని పశ్చాత్తాపడుతాం. జంక్ ఫుడ్, అతిగా వేయించిన పదార్థాలకు

Oily Food: ఆయిల్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటే చాలా అనర్థాలు.. ఈ చిట్కాలు పాటిస్తే సేఫ్..!
Oily Food
uppula Raju
|

Updated on: Mar 19, 2022 | 5:49 AM

Share

Oily Food: మనం చాలాసార్లు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటాం. ఆ తర్వాత అలాంటి ఆహారాన్ని ఎందుకు తిన్నామో అని పశ్చాత్తాపడుతాం. జంక్ ఫుడ్, అతిగా వేయించిన పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ ఇలాంటివి తిన్నప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే బెటర్‌గా ఉంటుంది. దీనివల్ల మీరు ఆయిల్ ఫుడ్ హానికరమైన ప్రభావాలను నివారించవచ్చు. కడుపు నొప్పి, ఉబ్బరం, అనేక ఇతర సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఆయిల్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఉదయమే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రియం అవుతుంది. ఇది పోషకాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియలో ఎటువంటి సమస్యలను కలిగించదు. పండ్లు, కూరగాయలు శరీరంలోని విటమిన్లు, ఫైబర్, మినరల్స్ లోపాన్ని తీరుస్తాయి. ఉదయం అల్పాహారంలో విత్తనాలు ఉన్న పండ్లను తినండి. భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి. దీంతో జంక్ ఫుడ్ తినకుండా ఉండొచ్చు. ఉదయం ఆరోగ్యకరమైన, పోషకమైన అల్పాహారం ఉండేలా చూసుకోండి. ఆహారంలో కూరగాయలు, తృణధాన్యాలు చేర్చండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.

ఏదైనా ఆయిల్ ఫుడ్‌ తిన్న తర్వాత డిటాక్స్ డ్రింక్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. విషపూరిత పదార్థాలు బయటకు వస్తాయి. నీళ్లలో నిమ్మరసం కలిపి తాగాలి. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయిల్ ఫుడ్ తిన్నాక ఒక కప్పు పెరుగు తింటే చాలా ఉపశమనం కలుగుతుంది. మరోవైపు వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తిన్న తర్వాత చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి. ఇది కాలేయం, ప్రేగులను దెబ్బతీస్తుంది. నూనెతో కూడిన ఆహారాన్ని జీర్ణం చేయడం అంత సులభం కాదు. తరువాత చల్లని ఆహారాన్ని జీర్ణం చేయడం మరింత కష్టమవుతుంది. ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత కొద్దిసేపు నడవండి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

IND vs AUS: ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువు కాదు.. ఎందుకంటే ఈ 5గురు ప్లేయర్లు చాలా డేంజర్..!

Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

Andhra Pradesh: బందరులో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ టర్న్ తీసుకున్న నాగలక్ష్మి ఆత్మహత్య..