Andhra Pradesh: బందరులో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ టర్న్ తీసుకున్న నాగలక్ష్మి ఆత్మహత్య..

Andhra Pradesh: వీవోఏ నాగలక్ష్మి సూసైడ్‌ బందరులో ఉద్రిక్తతను పెంచింది. వైసీపీ నేత లైంగిక వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందంటూ బంధువులు..

Andhra Pradesh: బందరులో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ టర్న్ తీసుకున్న నాగలక్ష్మి ఆత్మహత్య..
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 18, 2022 | 10:12 PM

Andhra Pradesh: వీవోఏ నాగలక్ష్మి సూసైడ్‌ బందరులో ఉద్రిక్తతను పెంచింది. వైసీపీ నేత లైంగిక వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందంటూ బంధువులు ఆందోళనకు దిగారు.. చివరకు నిందితుడు గరికపాటి నరసింహారావును పోలీసులు అరెస్టు చేశారు.

వైసీపీ నాయకుడు నరసింహారావు వేధింపులతో నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలతో ఈ అంశం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. వైసీపీ లీడర్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటే, ఏపీలో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధం అవుతుందన్నారు చంద్రబాబు. ప్రజలు ప్రాణాలు, బాధితుల వేదన కంటే… పోలీసులకు ప్రాధాన్యత ఏంటని ప్రశ్నించారు.

నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వాళ్లందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు తోటి వీఓఏ లు. అధికార పార్టీ అండ, మంత్రి భరోసా చూసుకునే.. నరసింహరావు అరాచకాలకు పాల్పడేవాడని నాగలక్ష్మి సోదరుడు తెలిపారు. పదేపదే వెంటపడి వేధించడంతోనే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని అన్నారు

వీఏవో నాగలక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వైసీపీ నేత గరికపాటి నరసింహారావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే, వీవోఏ నాగలక్ష్మి కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఏమీ లేదంటున్నారు ఉన్నతాధికారులు.

Also read:

Big News Big Debate: ఏపీలో పెగాసెస్‌తో బేరాలు కుదిరాయా? ప్రకంపనలు సృష్టిస్తున్న దీదీ వ్యాఖ్యలు.. టీడీపీ రియాక్షన్ ఏంటి?

Mla Shakeel Car Accident: జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో కీలక మలుపు.. వ్యక్తమవుతున్న అనేక సందేహాలు..!

మీటర్‌లో పాము !! తృటిలో తప్పించుకున్న కరెంట్‌ ఆఫీసర్‌..