AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: ఏపీలో పెగాసెస్‌తో బేరాలు కుదిరాయా? ప్రకంపనలు సృష్టిస్తున్న దీదీ వ్యాఖ్యలు.. టీడీపీ రియాక్షన్ ఏంటి?

Big News Big Debate: దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన పెగాసస్ SPY వేర్‌ ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. బెంగాల్‌ మీదుగా రాష్ట్రానికి

Big News Big Debate: ఏపీలో పెగాసెస్‌తో బేరాలు కుదిరాయా? ప్రకంపనలు సృష్టిస్తున్న దీదీ వ్యాఖ్యలు.. టీడీపీ రియాక్షన్ ఏంటి?
Big News Big Debate
Shiva Prajapati
|

Updated on: Mar 18, 2022 | 10:04 PM

Share

Big News Big Debate: దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన పెగాసస్ SPY వేర్‌ ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. బెంగాల్‌ మీదుగా రాష్ట్రానికి ఈ వ్యవహారం చాలా బలంగా తాకింది. స్పైవేర్ విషయంలో తనకొచ్చిన ఆఫర్‌ తిరస్కరించానన్న బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ.. నాటి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ పెద్ద బాంబే పేల్చారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనూ పెగాసస్ ప్రకంపనలు మొదలయ్యాయి. అంతా పీకే డ్రామానే అంటూ తెలుగుదేశం నాయకులు అంటే.. దర్యాప్తు జరిపించాల్సిందేనంటూ వైసీపీ డిమాండ్‌ చేస్తోంది.

బెంగాల్ CM మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. జస్ట్ రూ. 25 కోట్లు చెల్లిస్తే.. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ ఇస్తామంటూ తమకు 3ఏళ్ల క్రితమే ఆఫర్‌ వచ్చిందని బెంగాల్‌ అసెంబ్లీలో చెప్పారు మమత. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే పెగాసస్‌ను తమ ప్రభుత్వం వ్యతిరేకించిందన్న దీదీ.. అదే టైమ్‌లో ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. జాతీయస్థాయిలో ఈ కథనాలు సంచలనంగా కాగా ఏపీలో పొలిటికల్‌ ప్రకంపనలకు దారితీశాయి.

ఆఫ్‌ ది రికార్డులో మమత కామెంట్స్‌ను ఖండించారు TDP నాయకుడు నారా లోకేశ్‌. చట్ట వ్యతిరేక పనులను చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరన్న లోకేష్‌.. పెగాసస్‌ స్పైవేర్‌ను తాము ఉపయోగిస్తే జగన్ అధికారంలోకే వచ్చేవారా అని ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెం ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ పెగాసస్‌ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు టీడీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వం పెగసస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా అప్పటి డీజీపీ గౌతం సవాంగే చెప్పారంటూ డాక్యుమెంట్లు రిలీజ్‌ చేసింది తెలుగుదేశం. మా దగ్గర ఆ సాఫ్ట్‌వేర్ ఉంటే గొడ్డలిపోటు నుంచి వివేకాని కాపాడేవాళ్లం కదా అంటున్నారు టీడీపీ నాయకులు. పెగాసస్‌ అంతా పీకే ప్లానింగే అంటున్నారు వారు. వైసీసీయే తమతో పాటు మరికొందరు అధికారుల ఫోన్లు ట్యాప్‌ చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.

గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే టీడీపీ భుజాలు తడుముకుంటున్నారని ఎటాక్‌ చేసింది వైసీపీ. ట్యాపింగ్‌ నిజమేనని.. ప్రభుత్వ పరంగా కాకపోయినా ప్రైవేటుగా కొని ఉంటారని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. తమపై వాడారన్న అనుమానం ఉందని.. దీనిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే.

మొత్తానికి పెగాసస్‌ స్పైవేర్‌ తుట్టే ఏపీలో కదులుతోంది. నిజంగానే కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు కొనగలవా. మమతకు ఆఫర్‌ చేసింది ఎవరు?. ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు బెంగాల్‌ సీఎంకు చెప్పిందెవరు?. పెగాసస్‌ వ్యవహారం అటుంచితే కొత్తగా తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్న టీడీపీ నేతల ఆరోపణలు ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తాయో.?

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..