- Telugu News Photo Gallery The clouds are black know reason of black cloud and why it is different from white colour
Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
Clouds: మేఘాలు ఒక్కోసారి నలుపు రంగులో మరోసారి తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇలా రంగులు మారడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
Updated on: Mar 18, 2022 | 11:04 PM

మేఘాలు ఒక్కోసారి నలుపు రంగులో మరోసారి తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇలా రంగులు మారడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

సూర్యుని నుంచి వెలువడే తెల్లని కిరణాలను మేఘాలు గ్రహిస్తాయి. అందుకే ఒక్కోసారి మేఘం రంగు తెల్లగా కనిపిస్తుంది.

మేఘాలలో ఉండే నీటి బిందువులు అన్ని రంగులను పీల్చుకున్నప్పుడు మేఘాలు నలుపు రంగులో కనిపిస్తాయి.

మేఘాల నలుపు రంగుకి మరో కారణం కూడా ఉంది. మేఘాలు చాలా దట్టంగా ఎత్తుగా ఉంటే అవి నల్లగా కనిపిస్తాయి. మేఘాల మందం ఎక్కువగా ఉంటే చాలా తక్కువ సూర్య కిరణాలు దాని గుండా వెళతాయి. దీని ప్రభావం వల్ల మేఘం నలుపు రంగులో కనిపిస్తుంది.

మీరు ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మేఘాలు మంచు లేదా నీటి బిందువులను కలిగి ఉంటాయి. అవి సూర్యుని నుంచి వెలువడే కిరణాల తరంగదైర్ఘ్యం కంటే పెద్దవి. సూర్య కిరణాలు వాటిపై పడగానే అవి వాటిని ప్రతిబింబిస్తాయి. మేఘం మనకు తెల్లగా కనిపిస్తుంది. ఇదే ప్రక్రియ రివర్స్ జరిగితే మేఘాలు మనకు నల్లగా కనిపిస్తాయి.



