Health Tips: నిద్రపోకుండా ఎన్ని రోజులు బతకగలమో తెలుసా.. ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే
శరీరానికి నిద్ర అనేది చాలా అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే కంటి నిండా నిద్రపోవాలని (Sleeping) అంటారు. చురుగ్గా ఉండేందుకు సమతులాహారంతో పాటు సరైన నిద్ర కూడా...
శరీరానికి నిద్ర అనేది చాలా అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే కంటి నిండా నిద్రపోవాలని (Sleeping) అంటారు. చురుగ్గా ఉండేందుకు సమతులాహారంతో పాటు సరైన నిద్ర కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు. మనతో పాటూ రోజంతా కష్టపడిన అవయవాలు నిద్రపోయాకే సేదతీరుతాయి. నిద్ర అవసరాన్ని తెలిపేందుకు ప్రతి ఏడాది మార్చి మూడో శుక్రవారాన్ని ‘వరల్డ్ స్లీపింగ్ డే’ (World Sleeping Day) గా జరుపుకుంటున్నారు. నిద్ర అవసరంపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వరల్డ్ స్లీప్ సొసైటీకి (World Sleep Society) చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ- 2008 నుంచి స్లీపింగ్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నిద్ర గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి నిద్రలేకుండా ఎన్ని రోజులు బతకగలడు అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిని ఓ వ్యక్తి ప్రయోగం చేసి మరీ చూపించారు. 1965లో 17 ఏళ్ల విద్యార్థి రాండీ గార్డనర్.. సైన్స్ ఫెయిర్ కోసం నిద్రపోకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దాదాపు 264 గంటలు అంటే 11 రోజులు నిద్రపోకుండా ఉన్నాడు. అంతకుమించి ఉంటే అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా మృత్యువు సంభవిస్తుంది.
- ఆహార లేమి కన్నా నిద్రలేమే మనుషుల్ని త్వరగా చంపేస్తుంది.
- ఒక మనిషి తన జీవితకాలంలో మూడో వంతు నిద్రలోనే గడుపుతారు.
- నిద్రలోనే కొంతమంది పనులు చేస్తారు. వాటిని అసహజ కదలికలుగా చెబుతారు వైద్యులు. ఈ స్థితిని పారాసోమ్నియా అంటారు.
- ఉదయాన్నే నిద్ర లేవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి.
- నిద్రలేమి వల్ల నొప్పిని తట్టుకునే శక్తి తగ్గి పోతుంది.
- క్షీరదాలలో నిద్రను ఆపుకునే ఏకైక క్షీరదం మనిషి మాత్రమే. మిగతావన్నీ నిద్రరాగానే పడుకుంటాయి.
Also Read
- Krithi Shetty: కుర్రహీరోయిన్కి క్యూకడుతున్న క్రేజీ ఆఫర్స్.. ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..
- Jobs in Telangana: ఉద్యోగ ఖాళీల భర్తీకి కసరత్తు.. ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం.. ఏఏ అంశాలపై చర్చించారంటే
- Stock Market: బుల్ జోరు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,047, నిఫ్టీ 311 పాయింట్లు అప్..