Gujarat: ఇక నుంచి ఆ రాష్ట్రంలో స్కూల్స్‌లో భగవద్గీత తప్పనిసరి… వచ్చే ఏడాది నుంచి అమల్లోకి

Gujarat: గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని  పాఠశాలల్లో భగవద్గీత(Shrimad Bhagavad Gita) తప్పనిసరి చేయబడింది. విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ (( Minister Jitu Vaghani) విద్యార్థులకు ఇప్పుడు..

Gujarat: ఇక నుంచి ఆ రాష్ట్రంలో స్కూల్స్‌లో భగవద్గీత తప్పనిసరి... వచ్చే ఏడాది నుంచి అమల్లోకి
Bhagavad Gita In Gujarath S
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2022 | 8:27 PM

Gujarat: గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని  పాఠశాలల్లో భగవద్గీత(Shrimad Bhagavad Gita) తప్పనిసరి చేయబడింది. విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ (( Minister Jitu Vaghani) విద్యార్థులకు ఇప్పుడు పాఠ్యాంశాల్లో భాగంగా పవిత్ర గ్రంథం భగవద్గీతని బోధించనున్నామని చెప్పారు. రాష్ట్రంలోని  6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీత బోధిస్తామని చెప్పారు. భగవద్గీతను పాఠశాల పాఠ్యాంశాల్లో తప్పనిసరి భాగం చేయడం వెనుక ఉద్దేశం ‘భారతీయ సంస్కృతి , విజ్ఞాన వ్యవస్థ’ని పెంపొందించడమే. రాబోయే విద్యా సంవత్సరం, 2022-23(academic year 2022-23) నుండి గుజరాత్ పాఠశాలల్లో భగవద్గీత పఠనాన్ని అమలు చేయనున్నారు.

విద్యార్థులకు భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని తెలియజేసేందుకు స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించనుంది. 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో.. 9 నుంచి 12వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా భగవద్గీతను ప్రవేశపెడతామని విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ చెప్పారు.

పాఠశాలల్లో భగవద్గీత ఆధారంగా శ్లోకం, వక్తృత్వం, నాట్యం, క్విజ్ వంటి వివిధ కాంపిటేషన్లు, సృజనాత్మక పోటీలను నిర్వహించాలని తెలిపారు. కొత్త స్టడీ మెటీరియల్‌ దశల వారీగా స్కూల్స్ లో అమలు చేయబడుతుంది. పాఠ్య పుస్తకాలు పునరుద్ధరింబడాల్సి ఉంది. అయితే గుజరాత్ పాఠశాలల్లో పాఠశాల పాఠ్యాంశాల్లో పవిత్ర గ్రంథం భగవద్గీతను ప్రవేశపెట్టడం మొదటిసారి. అయినా ఇప్పటికే మధ్యప్రదేశ్ లో రామాయణం, మహాభారత ఇతిహాసాలను ఇంజనీరింగ్ విద్యా సిలబస్‌లో ప్రవేశ పెట్టారు. అయితే ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. ఇప్పటికే విద్యను కాషాయమయం చేయాలని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Holi 2022: అక్కడ చెప్పులతో ఒకరినొకరు కొట్టుకుంటూ హొలీ వేడుకలు.. ఎందుకంటే

Hing Benefits: వంటింట్లో ఉండే ఇంగువతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే.. మీరు ముక్కున వేలేసుకుంటారు

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..