Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhilesh Yadav: లఖింపుర్ ఖేరీ ఫైల్స్ సినిమా తీయండి.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ.. రైతులను జీపుతో తొక్కి చంపేసిన ఘటనపై 'లఖింపుర్ ఫైల్స్' అని ఓ సినిమా....

Akhilesh Yadav: లఖింపుర్ ఖేరీ ఫైల్స్ సినిమా తీయండి.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది
Akhilesh
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 17, 2022 | 8:39 PM

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ.. రైతులను జీపుతో తొక్కి చంపేసిన ఘటనపై ‘లఖింపుర్ ఫైల్స్’ అని ఓ సినిమా తీయాలని ఎద్దేవా చేశారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ (Kashmir Files) లాంటి చిత్రాలు మరిన్ని రావాలని, వీటి ద్వారా ప్రజలకు నిజాలు తెలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు భాజపా అగ్రనేతలు ఈ సినిమాను మెచ్చుకున్నారు. కశ్మీర్‌ లోయలో పండిట్లపై జరిగిన దాడులు, వాళ్లను అక్కడి నుంచి తరిమికొట్టిన విధానాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agni Hotri) వెండితెరపై చూపించేందుకు ద కశ్మీర్ ఫైల్స్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 11న ఈ సినిమా విడుదలైంది. 1990ల్లో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈ చిత్రాన్ని వెనకేసుకొస్తున్న భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా అఖిలేశ్ యాదవ్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు ‘లఖింపుర్ ఫైల్స్’ అనే సినిమా తీయాలని సెటైర్లు వేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తమపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లిందని రైతులు ఆరోపించారు. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. ఆగ్రహంతో రైతులు మూడు వాహనాలను తగలబెట్టారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేయటం వల్ల పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘర్షణలో మరో నలుగురు చనిపోయారు. మొత్తంగా నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

Also Read

The Kashmir Files: ఉచితంగా కశ్మీర్ ఫైల్స్ సినిమా అంటూ వాట్సాప్‌లో లింక్‌.. క్లిక్‌ చేశారో..

Teacher Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. బాసర ఆర్‌జీయూకేటీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.

curd: పెరుగుతో ప్రయోజనాలే కాదు ప్రమాదాలు కూడా.. రాత్రి పూట పెరుగు తింటే..