Teacher Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బాసర ఆర్‌జీయూకేటీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.
Teacher Jobs: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని బాసరలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.?
Teacher Jobs: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని బాసరలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇంజనీరింగ్‌లో భాగంగా సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌తో పాటు ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్‌డీ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు.
* సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్‌లో భాగంగా కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ అండ్ మేనేజ్‌మెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. నెట్/ స్లెట్/ సెట్ అర్హత ఉండాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-03-2022న ప్రారంభం కాగా 21-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Bichagadu 2: చరిత్రను మార్చి రాస్తా అంటున్న విజయ్ ఆంటోనీ.. “బిచ్చగాడు 2” థీమ్ సాంగ్
Explained: త్వరలో గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రో ధరలు.. దీనికి కారణం ఏంటో తెలుసా?