Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rambabu: అడ్డంకులు కలిగిస్తే సస్పెండ్ చేయకుంటే ఇంకేం చేయాలి.. ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్య

పవిత్రమైన దేవాలయం వంటి శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (YCP MLA Ambati Rambabu) అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిని...

Ambati Rambabu: అడ్డంకులు కలిగిస్తే సస్పెండ్ చేయకుంటే ఇంకేం చేయాలి.. ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్య
Ambati Rambabu
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 17, 2022 | 5:48 PM

పవిత్రమైన దేవాలయం వంటి శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (YCP MLA Ambati Rambabu) అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిని సస్పెండ్ (Suspend) చేయకుంటే ఇంకేమీ చేయాలని ప్రశ్నించారు. కరోనా కారణంగా గత రెండేళ్లు శాసనసభ సమావేశాలు సరిగా జరగలేదన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు సమయం ఉన్నప్పటికి సభా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ (Governor) ప్రసంగిస్తు్న్న సమయంలోనే అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. మద్యంపై ప్రభుత్వం విధానం ప్రజలకు తెలుసన్న అంబటి రాంబాబు.. కల్తీ మద్యం, మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎస్ఈబీ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రజలను నమ్మించేందుకు సభలో కల్తీ సారాపై ఆందోళన చేశారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సభకు రాకుండా వేరే వాళ్లను పంపించి గొడవ చేయిస్తున్నారని మండిపడ్డారు. గొడవ చేస్తే సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఎప్పటి నుండో ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న దానిపై వివరణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది ఒకే తరహా లక్షణాలతో మృతి చెందారు. వారిలో 15 మంది బాధిత కుటుంబ సభ్యులు.. కల్తీసారా తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు తెలిపారు. నిజాల్ని వెలికి తీయాల్సిన ప్రభుత్వం.. వాస్తవాల్ని కనుమరుగు చేసేందుకే ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఆ కుటుంబాల నుంచి వస్తున్నాయి. పట్టణంలో నాటుసారా విక్రయాలు కుటీర పరిశ్రమలా సాగుతున్నాయి. ప్రధానంగా శ్రీనివాస థియేటర్‌ కూడలి, పాత బస్టాండు, హరిజనపేట, చెరువుగట్టు సెంటర్‌, ఉప్పలమెట్ట, పద్మా థియేటర్‌ తదితర ప్రాంతాల్లో వీటి విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా మృతి చెందిన వారంతా అంతకు కొన్ని గంటల ముందు ఆయా ప్రాంతాల్లోని కేంద్రాల వద్దే నాటు సారా తాగారని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మరోవైపు నాటుసారా మరణాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. నాటుసారా అక్రమ నిల్వదారులపై పలు సెక్షన్ల కింద 10 కేసులు నమోదు చేసింది. ఈ మేరకు జంగారెడ్డిగూడెంలో 22 మంది నాటుసారా తయారీదారులు, విక్రేతలను సెబ్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 18 వేల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. సహజ మరణాలైతే దాడులు, కేసులు ఎందుకని ఈ సందర్భంగా సెబ్ అధికారులను ఐద్వా మహిళలు ప్రశ్నించారు.

Also Read

Russia Ukraine Crisis: భారత్ వైఖరి అమెరికాతో సంబంధాలను ప్రభావితం చేయదు.. యుఎస్ కాన్సుల్ జనరల్ సుస్పష్టం

Bichagadu 2: చరిత్రను మార్చి రాస్తా అంటున్న విజయ్ ఆంటోనీ.. “బిచ్చగాడు 2” థీమ్ సాంగ్

PayTM: బిలియనీర్ స్థాయి నుంచి మిలియనీర్ గా మారిన పేటిఎం ఫౌండర్.. రోజుకెన్ని కోట్లు కోల్పోతున్నారంటే..