PayTM: బిలియనీర్ స్థాయి నుంచి మిలియనీర్ గా మారిన పేటిఎం ఫౌండర్.. రోజుకెన్ని కోట్లు కోల్పోతున్నారంటే..

PayTM: పేటీఎం వ్యవస్థాపకుడు(Paytm founder) విజయ్ శేఖర్ శర్మకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇవి ఆయనకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. బిలియనీయర్ స్థాయి నుంచి మిలియనీర్(Millionaire) స్థాయికి ఆయన సంపద రోజురోజుకూ కరిగిపోతోంది.

PayTM: బిలియనీర్ స్థాయి నుంచి మిలియనీర్ గా మారిన పేటిఎం ఫౌండర్.. రోజుకెన్ని కోట్లు కోల్పోతున్నారంటే..
Paytm
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 17, 2022 | 2:17 PM

PayTM: పేటీఎం వ్యవస్థాపకుడు(Paytm founder) విజయ్ శేఖర్ శర్మకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇవి ఆయనకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. బిలియనీయర్ స్థాయి నుంచి మిలియనీర్(Millionaire) స్థాయికి ఆయన సంపద రోజురోజుకూ కరిగిపోతోంది. తన స్టాక్ లిస్టింగ్ అయ్యాక కొత్తగా తన సంస్థలోని ఉద్యోగులు బిలియనీర్లు అవుతారని ఆయన ఆ నాడు చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మార్చి 16 నాటి ఫోర్బ్స్ డేటా ప్రకారం.. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇకపై బిలియనీర్ కాదు. పేటీఎం స్టాక్‌ విలువ పతనం కావటమే దీని వెనుక ప్రధాన కారణంగా ఉంది. నోయిడా ప్రధాన కార్యాలయంగా ఉన్న కంపెనీ స్టాక్‌ భారీగా విలువ కోల్పోవడం.. కంపెనీలోని గందరగోళ పరిస్థితులను సూచిస్తోంది.

గత వారమే.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా RBI నిషేధం విధించింది. ఫోర్బ్స్ అందించిన వివరాల ప్రకారం.. పేటీఎం ఐపీఓ లిస్టింగ్ కి ముందు 2.35 బిలియన్ డాలర్లుగా గరిష్ఠంగా ఉన్న శర్మ సంపద ప్రస్తుతం కరిగిపోయింది. ఇప్పుడు అది కేవలం 999 మిలియన్ డాలర్లకు పడిపోయింది. పేటీఎం నవంబర్ 18, 2021న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయింది. ఆ రోజు నుంచి శర్మ పెట్టుబడి ప్రతి రోజూ రూ.88 కోట్లు ఆవిరవుతూ వస్తోంది. నేడు షేర్ విలువ సుమారు రూ. 600 లకు దగ్గరలో ట్రేడ్ అవుతోంది. చాలా రేటింగ్ కంపెనీలు తమ అంచనాల ప్రకారం ఈ షేర్ మరింతగా విలువను కోల్పోవచ్చని అంచనా వేస్తున్నాయి. దీని కారణంగా ఎక్కువ ధరలో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇవీ చదవండి..

ACB raids: ఏసీబీ సోదాల్లో ప్రభుత్వాధికారుల అక్రమాస్తులు బట్టబయలు.. దొరికిన ఆస్తులు చూసి అందరూ షాక్..

Stock Markets: బంపర్ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. తిరిగి వస్తున్న విదేశీ మదుపరులు..