TTD Temple – Vizag: సాగర తీరంలో తళుక్కుమంటున్న టీటీడీ ఆలయం.. శ్రీవారికి దర్శనానికి వేళాయే..!

TTD Temple - Vizag: విశాఖ సాగర తీరంలో నిర్మించిన టీటీడీ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వాస్తవానికి ఆరునెలల క్రితమే ప్రారంభోత్సవానికి ముస్తాబైనా పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వస్తోంది.

TTD Temple - Vizag: సాగర తీరంలో తళుక్కుమంటున్న టీటీడీ ఆలయం.. శ్రీవారికి దర్శనానికి వేళాయే..!
Ttd Temple
Follow us

|

Updated on: Mar 17, 2022 | 10:32 PM

TTD Temple – Vizag: విశాఖ సాగర తీరంలో నిర్మించిన టీటీడీ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వాస్తవానికి ఆరునెలల క్రితమే ప్రారంభోత్సవానికి ముస్తాబైనా పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 18 న అంకురార్పణ చేసి 23 వరకు ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతించనున్నారు. 23 న సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. విశాఖ సాగర తీరం లోని ఋషికొండ లలో ఒక కొండపై 10 ఎకరాల స్థలంలో 28 కోట్ల వ్యయం తో టీటీడీ నిర్మించిన ఈ వేంకటేశ్వరుని ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దబడింది.

టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలోని రిషికొండపై వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ఎదురుగా తిరుమల తరహాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం నిర్మించారు. ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఆలయాలను నిర్మించారు. టీటీడీ శిల్ప కళాకారులు తయారుచేసిన దేవతా విగ్రహాలను తిరుమల నుంచి విశాఖకు తీసుకువచ్చారు. ఇక్కడ నిత్యం పూజాది కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఇద్దరు పూజారులను నియమించనున్నారు. పూజారుల కుటుంబాలు ఉండేందుకు వీలుగా వసతి ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. దేవాలయం కింది భాగంలో టిక్కెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్లు, 150 మంది పట్టే ధ్యాన మందిరం, కల్యాణోత్సవ వేదిక, ఆఫీసు మొదలైనవి ఉండనున్నాయి.

ఈనెల 18 నుంచి శ్రీమహాలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 23 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ నుంచి ప్రత్యేకంగా సిబ్బంది విశాఖకు చేరుకున్నారు.18న రాత్రి 7 గంటలకు అంకురార్పణ, 7.30 గంటలకు కలశ స్థాపన, 21 మధ్యాహ్నం వేంకటేశ్వర స్వామి విగ్రహ స్థాపన, 22న సాయంత్రం 4.30 గంటలకు మహాశాంతి, అభిషేకం, 23న ఉదయం 9.20 నుంచి 10.30 గంటల మధ్యలో మహా సంప్రోక్షణ తదితర పూజలు చేస్తారు. అదే రోజు సాయంత్రం 3 గంటలు నుంచి శ్రీమహాలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 23న జరిగే మహా సంప్రోక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ ప్రారంభానికి రావాలని దేవదాయ శాఖతో పాటు టీటీడీ కూడా సీఎంను ఆహ్వానించింది.

ఆలయం ప్రారంభమైన నాటి నుంచే టీటీడీ దివ్యక్షేత్రం వేంకటేశ్వరుని దివ్యదర్శనం, స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లలేనివారు ఇక్కడ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ప్రసాదాలు,ప్రత్యేక పూజుల చేయ్యించుకోవచ్చు తిరుమలలో ఎవిదమైన పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కుడా అలాంటి సేవలను ఎర్పాటు చేసారు. భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా అన్ని ఎర్పాట్లు చేసారు. మెుత్తం మీద ఎపుడెప్పుడా అని ఎదురు చుస్తున్న వేంటేశ్వరస్వామి మరికొన్ని రోజుల్లోని దర్శనం ఇచ్చేందుకు రానుండంతోభక్తులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు.

Also read:

Telangana: అంతా బావే చెశాడు.. మ్యాటర్ తెలిసిన తరువాత ఆ యువతి ఏం చేసిందంటే..

Puzzle Picture: ఈ ఫోటోలో ఒక వీరుడు దాగున్నాడు.. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టగలరా?

Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!