Horoscope Today: కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఉద్యోగంలో.. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి.. శుక్రవారం రాశిఫలాలు..
ఈరోజు వీరు చేపట్టిన పనులను వాయిదా వేసుకుంటారు. ఉద్యోగంలో.. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచించి నిర్ణయాలు
మేష రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులను వాయిదా వేసుకుంటారు. ఉద్యోగంలో.. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.. నూతన పనులు ప్రారంభించకూడదు. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది.
వృషభ రాశి.. ఈరోజు వీరికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. బంధుమిత్రలతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తపనులు మధ్యలోనే వాయిదా వేస్తారు. ప్రయాణాలు అధికమవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి.. వీరికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో విభేధాలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. అనుకున్న పనులను కార్యచరణలోకి తీసుకువస్తారు. దూర ప్రయణాలు చేస్తారు.
కర్కాటక రాశి.. ఈరోజు వీరికి ఖర్చులు ఎక్కువవుతాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. మానసిక ఆందోళన ఏర్పడుతుంది. కొత్త పనులు వాయిదా వేస్తారు..
సింహా రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలకు వెళతారు.. ఆరోగ్యంగా ఉంటారు.. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు.. పాత స్నేహితులను కలుసుకుంటాు..
కన్య రాశి.. ఈరోజు వీరు నూతన వ్యక్తులను కలుసుకుంటారు. వారితో స్నేహం విషయంలో జాగ్రత్తలు అవసరం.సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో విరోధం కలుగుతుంది.
తుల రాశి.. ఈరోజు వీరు ఆరోగ్యం పట్ల శ్రద్దతో ఉండాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కుటుంబసభ్యులతో కలహాలు ఏర్పడతాయి. మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది.. వ్యాపారంలో… ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి…
వృశ్చిక రాశి.. ఈరోజు వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. బంధుమిత్రుల సహాకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి.
ధనుస్తు రాశి.. వీరికి మానసిక ఆందోళన పెరుగుతుంది.. అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది.
మకర రాశి.. ఈరోజు వీరు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభ రాశి.. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో సరదగా గడుపుతారు. ప్రయాణాలకు తగిన ఫలితం లభిస్తుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది.. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల ఈరోజు సంతోషంగా గడుపుతారు.
మీన రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు సులభంగా పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆనందంగా గడుపుతారు.. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విందులు.. వినోదాల్లో పాల్గొంటారు.
గమనిక :- (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)