AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.. ఆకస్మిక ప్రయాణాలు

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు...

Horoscope Today: ఈ రాశివారు గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.. ఆకస్మిక ప్రయాణాలు
Subhash Goud
|

Updated on: Mar 19, 2022 | 7:00 AM

Share

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మార్చి 19 (శనివారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. మేష రాశి: ఈ రాశివారు పని తీరుపై ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  2. వృషభ రాశి: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అధికారులు మీ పనితీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది.
  3. మిథున రాశి: చేపట్టిన పనులలో చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  4. కర్కాటక రాశి: మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక వ్యవహారంలో ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది.
  5. సింహ రాశి: అభివృద్దికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్త అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
  6. కన్య రాశి: చేపట్టిన పనులలో మంచి లాభాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  7. తుల రాశి: ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంతో ముందుకెళ్లడం వల్ల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి.
  8. వృశ్చిక రాశి: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివుడికి పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ది చెందుతారు.
  9. ధనుస్సు రాశి: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
  10. మకర రాశి: పట్టుదలతో ముందుకెళితే అనుకున్న పనులు సాధిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం మంచిది. కొన్ని విషయాలు మిమ్మల్ని ఉత్సాహ పరుస్తాయి.
  11. కుంభ రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
  12. మీన రాశి: ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో శుభవార్తలు వింటారు.

ఇవి కూడా చదవండి:

Bhadradri: రామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాద్రి.. పసుపు దంచే కార్యక్రమంతో ఉత్సవాలు

Telangana: యాదాద్రిలో మహకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి.. హాజరు కానున్న సీఎం.. ఆ తర్వాతే దర్శనాలకు అనుమతి

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?