AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bichagadu 2: చరిత్రను మార్చి రాస్తా అంటున్న విజయ్ ఆంటోనీ.. “బిచ్చగాడు 2” థీమ్ సాంగ్

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది

Bichagadu 2: చరిత్రను మార్చి రాస్తా అంటున్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు 2 థీమ్ సాంగ్
Bichagadu 2
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2022 | 4:27 PM

Share

Bichagadu 2: విజయ్ ఆంటోనీ(Vijay Antony)ని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది. తాజాగా బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఆ థీమ్ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చింది.

ఈ థీమ్ సాంగ్ చూస్తే .. రోల్స్ రాయిస్ కారులో నుంచి స్టార్ హోటల్ దగ్గర దిగిన హీరో అక్కడ బిచ్చగాడిలా మేకప్ వేసుకుంటాడు. ఆటోలో బయటకు వెళ్తాడు. అతను వెళ్తున్నది యాంటీ బికిలీ మిషన్ మీద అనేది తర్వాత తెలుస్తుంది. ఈ మిషన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు అంటూ యాంటీ బికిలీ లక్ష్యమేంటో ఈ థీమ్ సాంగ్ లో చెప్పేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం నేపథ్యంగా ఈ సాంగ్ వినిపించింది ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ఆసక్తిరేపుతోంది.

దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ మిల్టన్ ఓం ప్రకాష్ అందిస్తుండగా నిర్మాతగా ఫాతిమా విజయ్ ఆంటోనీ వ్యవహరిస్తున్నారు.  విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీకి విజయ్ ఆంటోనీ రచన, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం వహించడం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ఆ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మే నాకు స్ఫూర్తి.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. టికెట్స్ రేట్స్ విషయంపై..

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!