ప్రాణం కంటే రీల్స్, లైక్స్ ముద్దు..బైక్‌పై స్టంట్స్ చేస్తూ ఇద్దరు స్టూడెంట్స్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం
రహదారి భద్రత గురించి, ప్రమాదం గురించి అధికారులు ఎల్లప్పుడూ అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. ముఖ్యంగా యువత దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. రీల్స్ కోసం రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఒకొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముగ్గురు స్కూల్ స్టూడెంట్స్ రీల్ తీసుకున్తున్నారు. బైక్ నడుపుతున్న యువకుడు నియంత్రణ కోల్పోయి.. వేగామగా వేపై ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా.. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లైక్ కోసం ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబధించిన వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు స్నేహితులు రీల్స్ చేస్తూ బైక్‌పై ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తుండగా.. బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఇద్దరు యువకులు ప్రమాద స్థలంలోనే మరణించారు. వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంగేర్‌లోని జాతీయ రహదారి 80 సమీపంలోని బరియార్‌పూర్ సుల్తాన్‌గంజ్ లో ఈ సంఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థులు బైక్‌పై వెళుతుండగా.. వారి వాహనం ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో ఇద్దరు స్టూడెంట్స్ అక్కడికక్కడే మృతి చెందగా.., మూడో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు శుభం , ఆనంద్ కుమార్ లుగా గుర్తించారు. గాయపడిన బాలుడు సోను కుమార్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ముగ్గురు స్నేహితులు బైక్‌పై సుల్తాన్‌గంజ్‌కు వెళుతున్నారని.. జాతీయ రహదారి 80పై రీల్స్, వీడియోలు తీస్తున్నారని స్థానికుల కథనం. రీల్ తీస్తుండగా.. బైక్ నడుపుతున్న యువకుడు నియంత్రణ కోల్పోయాడని, దీంతో బైక్ హైవేపై ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిందని పోలీసు అధికారి చెప్పారు.
“రహదారి భద్రత గురించి ఎల్లప్పుడూ అధికారులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ, ముఖ్యంగా యువత దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ముంగేర్ ప్రజలు ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, హెల్మెట్లు ధరించాలని, అధిక వేగంతో బైక్‌లు లేదా వాహనాలను నడపకూడదని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, బైక్ లేదా వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఉపయోగించకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు” అని ముంగేర్ పోలీసు సూపరింటెండెంట్ ఇమ్రాన్ మసూద్ అన్నారు. ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నప్పటికీ యువత తరచూ ఈ విధంగా ప్రమాదాల బారిన పడుతున్నారని ముంగేర్ ఎస్పీ ఇమ్రాన్ మసూద్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








