Assam Police: అసోంలో అక్రమంగా డ్రగ్స్ రవాణా.. ఇద్దరు అరెస్ట్.. రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
Assam Police: ఈశాన్య రాష్ట్ర అసోంలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను (Drugs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 100 కోట్ల రూపాయలు..
Assam Police: ఈశాన్య రాష్ట్ర అసోంలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను (Drugs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 100 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. పొరుగు రాష్ట్రానికి చెందిన ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ లో 4, 60,000 యాబా ట్యాబ్లెట్లు (YABA tablets0 , 12 కిలోల ఐస్ క్రిస్టల్ ( Ice Crystal) , కిలోన్నర హెరాయిన్ లు ఉన్నాయని.. వీటి విలువ వంద కోట్ల కు పైగా ఉంటుందని అసోం పోలీసులు చెప్పారు. ఇదే విషయంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. డ్రగ్స్ అక్రమ రవాణాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. వంద కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి డ్రగ్స్ రాకెట్ ముఠా వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదన్నారు.
In a major success in war against drugs, Assam Police recovered 4.6 lac YABA tablets, Ice Crystal – 12 KGs, Heroin 1.5 KG with street value approximately 100 Crores. Two persons from a neighbouring state have been arrested: Assam CM Himanta Biswa Sarma pic.twitter.com/7kDGrciWog
— ANI (@ANI) March 16, 2022
Also Read: RRR Movie: రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను ఎలా బ్యాలెన్స్ చేశారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..
Gun Firing: తెలంగాణ లో తుపాకుల మోత.. ముఠాల ద్వారా అక్రమ రవాణా.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు