ఇంటర్ బాలికతో 35 ఏళ్ల వ్యక్తి ప్రేమాయణం..! పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి.. వివరాలు ఇలా ఉన్నాయి..?
AP Crime News : అతడొక ఇద్దరు పిల్లల తండ్రి కానీ ఇంటర్ బాలికతో ప్రేమాయణం నడిపించాడు. మాయమటాలు చెప్పి బాలికపై లైంగిక
AP Crime News : అతడొక ఇద్దరు పిల్లల తండ్రి కానీ ఇంటర్ బాలికతో ప్రేమాయణం నడిపించాడు. మాయమటాలు చెప్పి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు వెలుగుచూసాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని దోనేపూడి శివారు గ్రామానికి చెందిన బాలిక భట్టిప్రోలులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన 35 ఏళ్ల కూచిపూడి శ్రీను కొన్నేళ్లగా ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నాడు.
తరచు బాలికకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ దగ్గరయ్యాడు. రెండేళ్ల క్రితం అతడి భార్య చనిపోవడంతో పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించాడు. పథకం ప్రకారం ఈ నెల 12న అమ్మాయిని తీసుకొని తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్లి అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. కానీ ఆమె అడ్డుకొని పారిపోవడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలో బాలికను ఓ గుడికి తీసుకొని వెళ్లి బాలిక మెడలో తాళికట్టి భార్యాభర్తలమని నమ్మించి లైంగిక దాడిచేశాడు. అనంతరం తెల్లవారు జామున కారులో బాలికను ఇంటికి పంపించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికతో కొల్లూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. శ్రీను పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.