CORONA SECOND-WAVE: చిన్నారులపై కరోనా పంజా.. తొలి వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్ మరింత దారుణం.. లెక్కలివే!
దేశంలో గత రెండు నెలలుగా కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. మొదటి వేవ్‌కు రెండో వేవ్‌కు కరోనా చాలా మారిపోయింది. తొలి వేవ్‌లో ఎక్కువగా వయసు మీద పడిన వారిని ఇబ్బంది పెడితే.. సెకెండ్ వేవ్‌లో వయసుతో...
CORONA SECOND-WAVE EFFECT ON CHILDREN: దేశంలో గత రెండు నెలలుగా కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) ఉధృతి కొనసాగుతోంది. మొదటి వేవ్‌కు రెండో వేవ్‌కు కరోనా (CORONA) చాలా మారిపోయింది. తొలి వేవ్‌లో ఎక్కువగా వయసు మీద పడిన వారిని ఇబ్బంది పెడితే.. సెకెండ్ వేవ్‌లో వయసుతో సంబంధం లేకుండా కరోనా కబళిస్తోంది. తొలి వేవ్‌లో కరోనా బారిన పడిన యువత చాలా తక్కువ. పదేళ్ళకు లోపు పిల్లలైతే దాదాపు లేరు. కానీ.. సెకెండ్ వేవ్‌లో మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా వైరస్ (VIRUS) సంక్రమించి.. ప్రాణాలు హరిస్తోంది.
ఉత్తరాఖండ్ (UTTARAKHAND)లో కరోనా సెకండ్ వేవ్ పిల్లలపై పంజా విసురుతోంది. ఇటీవల అక్కడ కరోనా బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. పది రోజుల్లో ఏకంగా వెయ్యిమందికిపైగా చిన్నారులు కరోనా బారినపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కేవలం గత 10 రోజుల వ్యవధిలో తొమ్మిదేండ్ల లోపు వయసున్న 1000 మంది చిన్నారులకు కరోనా వైరస్ సోకిందని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో కొంతమంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.
గత ఏడాది దేశంలో కరోనా మహమ్మారి కాలు మోపినప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఏడాది కాలంలో ఉత్తరాఖండ్‌లో కేవలం 2,131 మంది చిన్నారులు మాత్రమే కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చిన్నారుల్లో కరోనా స్పీడ్ పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పదిహేను రోజుల వ్యవధిలో 264 మందికి మాత్రమే వైరస్ సోకగా.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మరో 15 రోజుల వ్యవధిలో వెయ్యి మందికి పైగా వైరస్ బారినపడ్డారు.
ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం 79,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 4,426 కరోనా మరణాలు సంభవించాయి. ఉత్తరాఖండ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగానూ చిన్నారుల్లో పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే మన దేశంలో వ్యాక్సిన్ (VACCINE) అందుబాటులో ఉంది. ప్రస్తుతం పలు సంస్థలు చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ (VACCINE TRIALS) నిర్వహిస్తున్నాయి. అవి విజయవంతమైతే 18 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అనేక సంస్థలు ఆరు నెలల చిన్నారుల నుంచి 18ఏళ్ల లోపు వారిపై జరుపుతున్న క్లినికల్ ట్రయల్స్ (CLINICAL TRIALS) వివిధ దశల్లో ఉన్నాయి.
అయితే.. కరోనా సోకితే కనిపించే లక్షణాలు కూడా ప్రస్తుతం మారిపోయాయి. గత సంవత్సరం ముందుగా జలుబు (COLD), జ్వరం (FEVER), దగ్గు (COUGH)తో కరోనా ఎఫెక్టు (CORONA EFFECT) ప్రారంభమయ్యాయి. సెకెండ్ వేవ్‌లో ఒక్క దగ్గు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ.. ఊపిరితిత్తులు పూర్తిగా ఇన్‌ఫెక్టయ్యాక పరిస్థితి ఒక్కసారిగా విషమిస్తోంది. దాంతో ఉన్నట్లుండి ఆక్సిజన్ (OXYGEN) అందక సతమతమవుతున్నారు. సమయానికి ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క.. దొరికినా ఆక్సిజన్ సౌకర్యం లేక సడన్‌గా మృత్యువాత పడుతున్నారు. తాజా కరోనా మరణాల్లో ఇలాంటి కేసులో అత్యధికంగా కనిపిస్తున్నాయి. చిన్నారుల విషయంలో ఇలా జరిగితే కనీసం వారు చెప్పుకోలేరు. సమయానికి వైద్య సౌకర్యం అందితే ఓకే.. లేదా పాపం చిన్నారులు మృత్యువు వొడిలోకి జారిపోవాల్సిందే.
ALSO READ: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. తగ్గేదే లేదంటున్న ఇజ్రాయిల్.. రంగంలోకి యుఎన్ఓ
ALSO READ: అధికారంలో లేకున్నా అదే ఊపు.. జాతీయ రాజకీయాల్లో మాయావతి ప్రస్తుతం ట్రెండింగ్.. ఎందుకంటే?