Rajinikanth Donates: ముఖ్యమంత్రిని కలిసి రూ.50 లక్షల విరాళం అందజేసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్

Rajinikanth Donates: కరోనాతో దేశమంతా అతలాకుతలం అవుతోంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని

Rajinikanth Donates: ముఖ్యమంత్రిని కలిసి రూ.50 లక్షల విరాళం అందజేసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్
Rajinikanth
Follow us

|

Updated on: May 17, 2021 | 3:02 PM

Rajinikanth Donates: కరోనాతో దేశమంతా అతలాకుతలం అవుతోంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు ప్రముఖుల నుంచి సెలబ్రిటీల వరకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట పెరుగుతున్న కోవిడ్‌ ప్రభావం వల్ల అనేక మంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వానికి విరాళాలు భారీ మొత్తంలో అందజేస్తున్నారు. ప్రభుత్వ సహాయ నిధికి విరాళాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.50 లక్షల విరాళం అందజేశారు. కాగా, రజనీ కాంత్‌ 35 రోజుల పాటు హైదరాబాద్‌లో అన్నాతై షూటింగ్‌ ఉండగా , ఇటీవల ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లారు.  ఆయన సోమవారం ముఖ్యమంత్రిని కలిసి ఈ విరాళాన్ని అందజేశారు.

కాగా, ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి రూపాయల విరాళం అందించగా, మురుగదాస్‌ రూ.25 లక్షలు, అజిత్‌ రూ.25 లక్షలు, సౌందర్య రాజనీకాంత్‌ కోటి రూపాయలు, దర్శకుడు వెట్రిమారన్‌ రూ.10 లక్షలు, ఎడిటర్‌ మోహన్‌, ఆయన తనయుడు మోహన్‌రాజా, జయం రవిలు రూ. 10 లక్షలు, తమిళ నటుడు శివ కార్తికేయన్‌ విరాళం కింద పాతిక లక్షలు, శంకర్‌ రూ.10 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఇలా రోజురోజు ప్రముఖులు విరాళాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు.

ఇవీ చదవండి:

CORONA SECOND-WAVE: చిన్నారులపై కరోనా పంజా.. తొలి వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్ మరింత దారుణం.. లెక్కలివే!

Bank Services: బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. ఆ రోజు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు.. ఆర్బీఐ కీలక ప్రకటన