“కరోనాకు కనికరం లేదు”.. సోషల్ మీడియాలో తమకు తోచిన సలహాలిస్తున్న హీరోయిన్స్.. శబాష్ అంటున్న నెటిజన్లు..

మాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదనే ఆ ఒక్క గ్యారంటీయే కాదు.. మరిన్ని భరోసాలు దొరుకుతున్నాయి మన హీరోయిన్ల దగ్గర. ఇప్పుడు కావాల్సింది నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్..

కరోనాకు కనికరం లేదు.. సోషల్ మీడియాలో తమకు తోచిన సలహాలిస్తున్న హీరోయిన్స్.. శబాష్ అంటున్న నెటిజన్లు..
Pooja Hegde
Follow us

|

Updated on: May 17, 2021 | 3:12 PM

Tollywood Heroines: మాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదనే ఆ ఒక్క గ్యారంటీయే కాదు.. మరిన్ని భరోసాలు దొరుకుతున్నాయి మన హీరోయిన్ల దగ్గర. ఇప్పుడు కావాల్సింది నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్.. బట్ ఆల్సో…. అంటూ తారలు దిగి వచ్చి… మన ముందుకొచ్చి నిలబడి.. వియ్యార్ విత్ యు అంటున్నారు. ఎస్… సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ల పోకడ పూర్తిగా మారిపోయింది. వాళ్ళ కళ్ళలో నిలువెత్తు బాధ్యత కనిపిస్తోందిప్పుడు. ఫస్ట్ వేవ్ టైంలో CCC కోసం జోష్ గా పాట పాడి జనాన్ని కరోనా పట్ల అలర్ట్ చేశారు మన స్టార్ హీరోలు. ఇంకాస్త క్రియేటివిటీ జోడించి మరికొన్ని మీమ్స్, వీడియోలు, మాషప్ సాంగ్స్ తో అప్పట్లో పెద్ద సందడే కనిపించింది. సెకండ్ వేవ్ వచ్చేసరికి పరిస్థితి సీరియస్ గా మారి.. గంభీరంగా కనిపిస్తోంది వాతావరణం. నేరుగా క్షేత్రస్థాయిలో దిగి.. సోషల్ మీడియా ద్వారా  పీపుల్ కి డైరెక్ట్ గానే హెల్ప్ చేస్తోంది సినీ పరిశ్రమ. ఈ గ్యాప్ లోనే మేమూ వున్నాం అంటూ ఓ చెయ్యేస్తున్నారు స్టార్ హీరోయిన్లు. నెట్లో తమకు తోచిన సలహాలిస్తూ ఫాలోయర్లను అలెర్ట్ చేస్తున్నారు. మాస్క్ ఎలా పెట్టుకోవాలనే బేసిక్స్ కూడా గుర్తు చేస్తున్నారు.

బుట్టబొమ్మ పూజా హెగ్డే అయితే.. కోవిడ్ పేషేంట్ గా తన ఎక్స్ పీరియన్స్సెస్ ని షేర్ చేసుకుంటున్నారు. క్వారెంటైన్లో వున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవడం చేతకాలేదని, డాక్టర్ చెబితే నేర్చుకున్నానని, అదెంత సులభమో మీరూ చూడండి అంటూ వీడియో పోస్ట్ చేశారు.ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, ఫిట్ నెస్ ని ఎలా మెరుగుపర్చుకోవాలి లాంటి ఫిజికల్ ఇష్యుస్ మీద హీరోయిన్లు స్పెషల్ వీడియోస్ షేర్ చేస్తున్నారు. స్టార్ సింగర్ సునీత అయితే.. ‘జస్ట్ కమ్ అండ్ రిలాక్స్ విత్ మీ’ అంటూ ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఇన్ స్టా లైవ్ లోకొస్తున్నారు. మంచిమంచి మాటలే కాదు… మీరుకోరిన పాటలు కూడా అంటూ ఆవిధంగా సేదదీరుస్తున్నారు సునీత ఉపద్రష్ట. ఈ టైంలో మెంటల్ హెల్త్ కూడా చాలా కీలకం అంటూ.. మానసిక శాస్త్రవేత్తలతో లైవ్ కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు సమంత. ఎటువంటి డిప్రెషన్స్ నీ దగ్గరకు రానివ్వకుండా ఏం చేయాలి… అనే బేసిక్స్ ని ఎక్స్పర్ట్స్ ద్వారా చెప్పిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pavala Syamala: కడుపుబ్బా నవ్వించిన పావలా శ్యామల కన్నీటి గాథ.. సాయం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ నటి

Pooja Hegde: ఆక్సీమీట‌ర్‌ను ఎలా ఉప‌యోగించాలో చెబుతోన్న‌ బుట్ట‌బొమ్మ‌.. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా..